Home » నెటిజన్ వర్సెస్ అనసూయ…సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా లేదుగా…!

నెటిజన్ వర్సెస్ అనసూయ…సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా లేదుగా…!

by AJAY
Published: Last Updated on
Ad

అన‌సూయ అంటే టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. మొద‌ట న్యూస్ యాంక‌ర్ గా కెరీర్ ను ప్రారంభించిన అన‌సూయ ఆ త‌ర‌వాత జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ గా మారింది. జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. త‌న అందం మ‌రియు అభిన‌యంతో కుర్రాళ్ల‌ను ఫిదా చేసింది. అన‌సూయ ఫిగర్ కు కుర్రాళ్లు ఫిదా అవ్వ‌డంతో అతిత‌క్కువ కాలంలోనే టాప్ యాంక‌ర్స్ లిస్ట్ లో చేరిపోయింది.

Advertisement

ఇక ఆ త‌ర‌వాత ప‌లు టీవీ షో ల‌తో అన‌సూయ బిజీగా మారిపోయింది. అంతే కాకుండా ఆ త‌ర‌వాత క్ష‌ణం సినిమాతో న‌టి గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అంతే కాకుండా ఆ త‌రవాత సుకుమార్ ద‌క్శ‌త‌క్వంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన రంగ‌స్థ‌లం సినిమాలో న‌టించింది. ఈ సినిమాలో అన‌సూయ రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో ఒదిగిపోయింది.

Advertisement

దాంతో ఈ సినిమా త‌ర‌వాత కూడా అన‌సూయ‌ను రంగ‌మ‌త్త అని పిల‌వ‌డం మొద‌లు పెట్టారు. ఇక ఆ త‌ర‌వాత కెరీర్ లో తిరిగి వెన‌క్కి చూసుకోలేదు. మ‌రోసారి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమాలో న‌టించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ చిత్రంలో అన‌సూయ పాత్ర‌కు మంచి మార్కులు ప‌డ‌టంతో పాటూ ప్ర‌స్తుతం బాలీవుడ్ లోనూ ఛాన్స్ లు అందుకుంటోంది.

వాలెంటైన్స్ డే సంధ‌ర్బంగా అన‌సూయ సోష‌ల్ మీడియా తన భ‌ర్త‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ…నీతో లైఫ్ క్రేజీగా ఉంటుంది అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. దాంతో అన‌సూయ క్యాప్ష‌న్ కు ఓ నెటిజ‌న్ … అదేం లేదు అక్కా వాడిద‌గ్గ‌ర డ‌బ్బు చాలా ఉంది అందుకే. అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ అన‌సూయ నెటిజ‌న్ కు కౌంట‌ర్ ఇస్తూ…అదేంట్రా త‌మ్ముడూ అలా అనేశావ్…ఎంతుందేంటి డ‌బ్బు..? న‌నా ద‌గ్గ‌ర లేదా డ‌బ్బు. అయినా నీకు ఎవ‌రి ద‌గ్గ‌ర ఎంత ఉందో తెలుసు క‌దా. అయినా బావ‌ను ఎవ‌రైనా వాడు అంటాడా త‌మ్ముడు. ఏం పెంప‌కం రా నీది..చెంప‌లేసుకో లేక‌పోతే నేను చెప్పుతో వేస్తా….అంటూ కౌంట‌ర ఇచ్చింది. ప్రస్తుతం అన‌సూయ‌తో నెటిజ‌న్ వార్ వైర‌ల్ అవుతోంది.

ALSO READ : ఆ ఒక్క విషయం jr:NTR ను వేధిస్తోందా..చెప్పుకోలేని ఆ బాధేంటంటే..?

Visitors Are Also Reading