Home » పూన‌మ్ కౌర్‌కి పెళ్లి అయిందా..? అందుకే అలా చేసిందా ?

పూన‌మ్ కౌర్‌కి పెళ్లి అయిందా..? అందుకే అలా చేసిందా ?

by Anji
Ad

న‌టి పూన‌మ్ కౌర్ సోష‌ల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ.. త‌ర‌చూ ఏదో ఒక‌ అప్‌డేట్‌తో కానీ స్టిల్‌తో కానీ నెటిజ‌న్ల‌ను ప‌లుక‌రిస్తుంటుంది. త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో ఎంతో ఒత్తిడికి లోన‌య్యాన‌ని, త‌న పేరు దెబ్బ‌తింద‌ని ఇప్ప‌టికే చెప్పుకొచ్చిన విష‌యం విధిత‌మే. ముఖ్యంగా గ‌త కొంత‌కాలంగా వెండితెర‌కు దూరంగా ఉంటోంది.

Also Read : “ఆచార్య” ఫ్లాప్….చిరంజీవి రామ్ చ‌ర‌ణ్ ప్రొడ్యూస‌ర్ ల‌కు ఎంత‌ ఇచ్చారో తెలుసా..?

Advertisement

 

తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. క‌ర్వాచౌత్ శుభాకాంక్ష‌లు చెబుతూ చేతిలో జ‌ల్లెడ‌ను ప‌ట్టుకుని చంద్రుడిని చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను పూన‌మ్ కౌర్ సోష‌ల్‌మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం దీనిపై తెగ చ‌ర్చ న‌డుస్తోంది. ఎందుకంటే త‌మ భ‌ర్త క్షేమాన్ని కోరుతూ క‌ర్వాచౌత్‌ను పెళ్లయిన మ‌హిళ‌లే జ‌రుపుకుంటారు. నార్త్‌లో ఈ పండుగ‌ను ఎక్కువ‌గా జ‌రుపుకుంటారు.

Advertisement

Also Read : విక్ర‌మ్ లో విజ‌య్ సేతుప‌తి ఎంట్రీ సీన్ ను అక్క‌డ నుండి కాపీ కొట్టారా…? డైరెక్ట‌ర్ ను ఆడుకుంటున్న నెటిజ‌న్లు..!

 

భ‌ర్త పేరు మీద ఉప‌వాసం చేసి జ‌ల్లెడ‌లో చంద్రుడిని చూసిన వెంట‌నే భ‌ర్త ముఖాన్ని చూసి ఆశీర్వాదం తీసుకుంటారు. పెళ్లి కానీ పూన‌మ్ క‌ర్వాచౌత్ ఫోటోను షేర్ చేయ‌డంపై నెటిజ‌న్లు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. మీకు ఇదివ‌ర‌కే పెళ్లి అయిందా..? లేదా పెళ్లి చేసుకోబోతున్నారా అని పూన‌మ్ పోస్ట్ పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇందుకు పూనమ్‌ మాత్రంసైలెంట్‌గానే ఉండిపోవ‌డం విశేషం.

Also Read : నాగ‌చైత‌న్య సినిమా టైటిల్ ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading