Home » “ఆచార్య” ఫ్లాప్….చిరంజీవి రామ్ చ‌ర‌ణ్ ప్రొడ్యూస‌ర్ ల‌కు ఎంత‌ ఇచ్చారో తెలుసా..?

“ఆచార్య” ఫ్లాప్….చిరంజీవి రామ్ చ‌ర‌ణ్ ప్రొడ్యూస‌ర్ ల‌కు ఎంత‌ ఇచ్చారో తెలుసా..?

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ముఖ్యమైన పాత్రలో నటించారు. సినిమాలో చరణ్ పాత్ర దాదాపు 30 నిమిషాల కంటే ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. సినిమా టీజర్ మరియు పోస్టర్ లు ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Advertisement

కానీ ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. కొరటాల శివ కెరీర్ లో ఇప్పటివరకు త‌న‌ ఫ్లాప్ ను చూడలేదు. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి కానీ ఆచార్య మాత్రం దారుణమైన ఫ్లాప్ గా నిలిచింది. అదేవిధంగా చిరంజీవి కెరీర్ లోనూ ఈ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాతో నిర్మాతలకు చాలా నష్టాలు వచ్చాయి. ఇక చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డంతో థియేటర్ల వ‌ద్ద‌ సందడి వాతావరణం కనిపిస్తోంది. కాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆచార్య సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను చిరు పంచుకున్నారు. ఆచార్య గురించి చిరు మాట్లాడుతూ… తాము నటించిన ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే దానికి పూర్తి స్థాయి బాధ్యత తీసుకుంటామని చెప్పారు.

ఆచార్య సినిమా ఫ్లాప్ అయినందుకు బాధపడలేదని అన్నారు. తాను, రామ్ చరణ్ కలిసి సినిమా కోసం తీసుకున్న రెమ్యున‌రేష‌న్ లో 80% తిరిగి ఇచ్చేసామని చెప్పారు. అంతేకాకుండా గరికపాటి ఇష్యూపై కూడా చిరు స్పందించారు. గరికపాటి పెద్దాయన ఆయన చేసిన వ్యాఖ్యలపై వివాదం అవసరం లేదంటూ చిరు కామెంట్ చేశారు.

Visitors Are Also Reading