మీ గొంతులో కఫం పేరుకుపోవడం అనేది సాధారణంగా అందరికీ వచ్చే సమస్య. ఇది పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎవ్వరినైనా వేధిస్తుంటుంది. ముఖ్యంగా ఇది ప్రస్తుత వర్షాకాలంలో అయితే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందనే చెప్పవచ్చు. అసలే ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సంభవిస్తుంటాయి. అందులో ఇక గొంతులో కఫం ఒక సమస్య కూడా ఉంటుంది. గొంతులో కఫం పేరుకుపోవడం వల్ల దగ్గు, శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం, చికాకు, మింగడానికి తీవ్రమైన ఇబ్బంది, ఛాతినొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి : ఆ దేశంలో ప్రతి పురుషుడు రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే జైలుకే..!
ఇక ఈ కఫాన్ని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మందులు ఏవేవో వాడుతుంటారు. ఇలా ఆ మందులు, ఈ మందులు వాడే కంటే.. ఈ సింపుల్ ఇంటి చిట్కాను ప్రయత్నిస్తే చాలు సులభంగా మీ గొంతులోని కఫాన్ని నివారించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా గురించి తెలుసుకుందాం. ఐదు మిరియాలు, రెండు యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకొని మెత్తని పొడిగా దంచుకోవాలి. ఆ తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోసి వేడి చేయాలి. వాటర్ బాగా మరిగిన తరువాత ముందు దంచి పెట్టుకున్న పొడిని వేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి.
ఇవి కూడా చదవండి : పెరుగులో ఇది కలుపుకుని తింటే లాభాలెన్నో.. దాని గురించి తెలిస్తే మాత్రం ఇక వదలరు..!
అలా మరిగించిన తరువాత ఆ వాటర్‌ని ఫిల్టర్ చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపుకొని తాగాలి. ప్రతిరోజు ఉదయం ఇలా చేయడం ద్వారా గొంతులో పేరుకు పోయిన కఫం ఆనవాలు కూడా కనిపించకుండా కరిగిపోయింది. ఈ చిట్కాతో కేవలం కఫం మాత్రమే కాదు.. అందులోని యాంటి బ్యాక్టిరియల్, యాంటి మైక్రబయల్ వంటి లక్షణాలు దగ్గు, జలుబు, గొంతునొప్పి, గొంతు ఇన్‌పెక్షన్ వంటి సమస్యలను నివారిస్తాయి. ఇక శ్వాసకోశలో అడ్డంకులు ఉంటే వాటిని తొలగించి ఊపిరి ఫ్రీగా ఆడేవిధంగా చేస్తాయి. ఛాతిలో మంట, నొప్పి వంటి సమస్యలు కూడా దరి చేరవు. ఇంకెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన చిట్కాతో మీ సమస్యను పరిష్కరించుకోండి.
ఇవి కూడా చదవండి : ఘనంగా అలీ కూతురు ఎంగేజ్‌మెంట్.. పెళ్లి కొడుకు ఎవరంటే..?