Home » పవన్ కళ్యాణ్ “ఖుషి” రీమేక్ అనుకున్నారా..? అయితే ఇది చదవాల్సిందే…!

పవన్ కళ్యాణ్ “ఖుషి” రీమేక్ అనుకున్నారా..? అయితే ఇది చదవాల్సిందే…!

by AJAY
Ad

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి పవన్ కళ్యాణ్ లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. యూత్ ఐకాన్ గా పవర్ స్టార్ టాలీవుడ్ లో రాణిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ ను నిలబెట్టిన సినిమాలలో ఖుషి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Pawan Kalyan Kushi movie

Advertisement

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ గా భూమిక చావ్లా నటించింది. ఇక లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోని డైలాగులు, ఫైట్లు, డాన్స్ ప్రతిదీ సరికొత్త పవన్ కళ్యాణ్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాయి. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఎంతోమంది లేడీ ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకున్నారు.

Advertisement

Pawan Kalyan Kushi movie

Pawan Kalyan Kushi movie

అంతేకాకుండా ఈ చిత్రానికి ఎస్ జే సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఎఎం రత్నం నిర్మించారు. అయితే ఈ సినిమాను తమిళం లోని ఖుషి చిత్రానికి రీమేక్ గా తెరకెక్కించారు అని అంతా అనుకుంటున్నారు. దానికి కారణం ఈ సినిమా కథ తోనే 2000 సంవత్సరంలో తమిళంలో ఖుషి చిత్రం విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇక తెలుగులో ఖుషి సినిమా 2001 సంవత్సరం లో విడుదలైంది. అయితే ఈ సినిమా రీమేకా….. కాదా అన్న విషయంపై తాజాగా నిర్మాత ఏ.ఎం రత్నం క్లారిటీ ఇచ్చారు.

ఓ ఇంటర్వ్యూ నిర్మాత మాట్లాడుతూ…. తమిళ్ ఖుషి సినిమా కంటే ముందే బద్రి షూటింగ్ సమయంలోనే పవన్ కళ్యాణ్ కు ఖుషి కథను వినిపించామని చెప్పారు. తమిళ్ మరియు తెలుగులో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నానని అన్నారు. కానీ బద్రి సినిమా పూర్తయ్యే లోపు తమిళంలో ఖుషి షూటింగ్ పూర్తయి విడుదల అయిందని చెప్పారు. ఖుషి సినిమా ఏ సినిమాకు కూడా రీమేక్ కాదని క్లారిటీ ఇచ్చారు.

Also read : పుట్టుమ‌చ్చ‌ల గురించి అడిగిన రిపోర్ట‌ర్…డీజే టిల్లు హీరోయిన్ సీరియ‌స్..!

Visitors Are Also Reading