ప్లాస్టిక్ కప్పులు వాడితే ప్రమాదం అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ పేపర్ కప్పు కూడా ప్రమాదమేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పేపర్లతో టీ, కాఫీలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని ఐఐటి పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి వాడి పారేసే డిస్పోజబుల్ పేపర్ కప్పుల్లో 100 మిల్లీమీటర్ల చొప్పున మూడుసార్లు టీ తాగితే 75 వేల అతి సూక్ష్మ హానికర ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోనికి వెళతాయని, అవి ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయని తెలిపారు.
READ ALSO : కిచ్చా సుదీప్ పై ప్రకాష్ షాకింగ్ కామెంట్స్… బిజెపికి మద్దతు ఇవ్వడం ఏంటి..?
Advertisement
80-90 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి కలిగిన 100 మిల్లి మీటర్ల ద్రవపదార్థం ద్వారా దాదాపు 25వేల మైక్రాన్ల ప్లాస్టిక్ కణాలు మనలోకి చేరతాయని అన్నారు. దీంతో క్రోమియం, కాడ్మీయం వంటి విషపూరిత లోహాలు శరీరంలోకి వెళ్తాయని తెలిపారు. పేపర్ కప్పులు హైడ్రోఫోబిక్ ఫిల్మ్ సన్నటి పొరతో తయారు చేస్తారు. కాగా ఇందులోను పాలి ఇతలీన్ అంటే ప్లాస్టిక్ ఉంటుంది. అలా తయారు చేసిన పేపర్ కప్పుల్లో టీ పోసినప్పుడు కేవలం ఆ పేపర్లోని మైక్రో ప్లాస్టిక్ కణాలతో పాటు ఇతర ప్రమాదకర రేణువులు ద్రవంలో కలిసిపోయి శరీరంలోకి వెళ్తున్నాయని చెప్పారు.
Advertisement
READ ALSO : AdiPurush : హనుమాన్ జయంతి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్…
టీ లేక ఇతర ఏ వేడి ద్రవం పోసిన 15 నిమిషాల్లోపే ఈ మైక్రో ప్లాస్టిక్ లేయర్ లో చర్య జరుగుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ సుధా గోయల్ తెలిపారు. 85-90 డిగ్రీల సెల్సియస్ వేడి ఉండే 100 ఎంఎల్ వేడి ద్రవంలోకి పేపర్ కప్పు నుంచి 25వేల మైక్రో ప్లాస్టిక్ రేణువులు విడుదలవుతాయని అధ్యయనంలో రుజువైందని తెలిపారు. ఈ రేణువుల్లో అయాన్లతో పాటు క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత భారీ లోహాలు ఉంటాయని ఆమె వివరించారు. వీటివల్ల అనేక రకాలైన క్యాన్సర్లు వస్తాయని, కాబట్టి సాధ్యమైన మేరకు పేపర్ కప్పులు కూడా వాడకుండా ఉంటే చాలా చాలా మంచిదని సూచిస్తున్నారు.
READ ALSO : సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు టికెట్ ధరలు..టైమింగ్స్ ఇవే