మూత్రం అనేది మన ఆరోగ్యం ఎలా ఉందో చూపిస్తుంది. దీంట్లో ఎలాంటి సందేహం అనేది ఉండదు. మనం మూత్రానికి వెళ్ళినప్పుడు యూరిన్ స్పష్టంగా వస్తే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే. కానీ మూత్రం దుర్వాసనతో, ముదురు రంగులో వస్తే మాత్రం శరీరంలో ఏదో సమస్య ఉన్నట్టే అని గమనించాలి. ఒక్కోసారి మీరు ఎక్కువ ఫోర్స్ తో మూత్రం పోసినప్పుడు బుడగలు కూడా వస్తాయి. ఇది ఇలా ఉండగా, మనం మూత్రం ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తప్పనిసరిగా అందరూ గుర్తుపెట్టుకోవాలి.
Advertisement
Advertisement
పరిశుభ్రత అంటూ బయట వెళ్లకుండా మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత బాత్రూం కి వెళ్లాలని అనుకుంటారు. సరే కొన్ని సమయాల్లో మూత్రాన్ని ఆపుకుంటారు. కానీ మీరు దీన్ని అతిగా చేస్తే మీకు మూత్రంలో ఇన్ఫెక్షన్లు, మూత్రశయం సాగడం, మూతపిండాల్లో రాళ్లు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి ఉంటుంది. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కండరాల మీద ఒత్తిడి పడుతుంది. అంతేకాకుండా మూత్రం ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల బ్యాక్టీరియా అవకాశాలు కూడా పెరుగుతాయి.
ఇది మూత్ర నాళాలలో ఇన్ఫెక్షన్ కి వచ్చే అవకాశం ఉంది. అప్పుడప్పుడు మూత్రంలో రక్తం కనిపించడం, విసర్జన సమయంలో మంటగా అనిపించడం, నిరంతరం మూత విసర్జన చేయవలసి రావడం, రంగు మారిన, మూత్రంలో దుర్వాసన, మూత్ర విసర్జన సమయంలో పొత్తికడుపు ప్రాంతంలో నొప్పి రావచ్చు. అంతేకాకుండా మూతపిండాల సమస్యలు ఉండే వారిలో ఇది ఎంతో ప్రమాదకరం. గర్భిణీ స్త్రీలు మూత్రం ఆపుకోవడం మాత్రం అస్సలు చేయకూడదు.
READ ALSO : సీఎం జగన్… శ్రీకృష్ణుడు, శ్రీరాముడు లాంటోడు-శ్రీ రెడ్డి