Home » కూల్ డ్రింక్ బాటిల్ లో నిండుగా నింపితే అంత ప్రమాదమా..?

కూల్ డ్రింక్ బాటిల్ లో నిండుగా నింపితే అంత ప్రమాదమా..?

by Anji
Published: Last Updated on

సాధారణంగా ప్రతీ ఒక్కరికీ తన జీవితంలో ఏదో ఒక అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో దాదాపుగా కూల్ డ్రింక్ అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. చిన్న పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కూడా కూల్ డ్రింక్స్ ని ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. చాలా మంది ఫంక్షన్ లలో పెళ్లిళ్లలో బంధువులు ఇంటికి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా ఈ కూల్ డ్రింక్ ని ఇస్తూ ఉంటారు. ఈ కూల్ డ్రింక్ లేనిది ఏ పార్టీ ఫంక్షన్ కూడా నడవదు. 

 

 

ఇక వేసవికాలంలో అయితే వీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ శీతల పానీయాలను వేసవిలో ఎండ బాగా ఉండటంతో ఎక్కువగా సేవిస్తూ ఉంటారు. మంచి నీళ్లు ఎన్ని తాగినప్పటికీ దాహం తీరకపోవడంతో ప్రజలు శీతల పానియాలకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఎండ తాపానికి తట్టుకోలేక కోడ కొందరూ కూల్ డ్రింక్స్ ఆశ్రయిస్తుంటారు. ఈ కూల్ డ్రింక్స్ బాటిల్స్ ని మీరు ఎప్పుడైనా గమనించారా..? బాటిల్ లో నిండుగా ఎప్పుడూ కూడా డ్రింక్ నింపి ఉండదు. దాని వెనుక ఉన్నటువంటి కారణం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? అయితే ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. 

 

 

సాధారణంగా ఏ  కూల్ డ్రింక్ కి అయినా బాటిల్ మూత వరకు నిండుగా నింపి ఉండదు.. దాని వెనుక అసలు కారణం ఏంటంటే.. ఈ కూల్ డ్రింక్ లో కార్బోరేటర్ వాటర్ ని కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ తో మిక్స్ చేయడం వల్ల గ్యాస్ అనేది బాటిల్ లో పట్టడానికి ఫ్లేవర్డ్ లింకులు కాస్త తగ్గించి బాటిల్ లో పోస్తుంటారు. అలా కాకుండా కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ కోసం ఎలాంటి ఖాలీ లేకుండా నిండుగా డ్రింక్ ని నింపినట్టయితే ఆ బాటిల్ పగిలిపోయే ప్రమాదముంది. దీంతో అధిక ఉష్ణోగ్రత ఉన్న సమయంలో ఖాళీ లేకుంటే బాటిల్ పగిలిపోతుంది. అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి కూల్ డ్రింక్ నింపుతారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆదిపురుష్ మూవీ టాక్.. ఇక ఆ సీన్స్ కి విజిల్సే..!

కొడాలి నాని, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలుసా?

Visitors Are Also Reading