షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది మౌనిక రెడ్డి. యూట్యూబ్ ఛానల్లో షణ్ముఖ్ జస్వంత్ సరసన షార్ట్ ఫిలిమ్స్ లో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ భామ. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలను అందిపుచ్చుకుంది. కానీ ఈ అమ్మడుకి ఎక్కువగా గుర్తింపును తెచ్చిపెట్టింది మాత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన లేడీ కానిస్టేబుల్ గా నటించి ఎమోషన్స్ ని అద్భుతంగా పండించింది.
ఇక ఈ అమ్మడు మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న సమయంలోనే సందీప్ అనే వ్యక్తిని గత సంవత్సరం వివాహం చేసుకుంది. కొన్నేళ్లపాటు అతనితో సహజీవనం చేసి వివాహం చేసుకుంది. వీరి వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి సమయంలో ఈ అమ్మడు చాలా సంతోషంగా ఓ వీడియోని షేర్ చేయగా…. చాలా పాపులర్ అయింది. ఇక చాలా సంతోషంగా సాగుతున్న సమయంలోనే ఈ అమ్మడు తన భర్తకు విడాకులు ఇవ్వబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
Advertisement
అలా రూమర్స్ రావడానికి గల కారణం మౌనిక రెడ్డి తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను తన భర్తతో వున్న ఫోటోలు అన్నింటిని ఇన్ స్టా అకౌంట్ నుంచి డిలీట్ చేసింది. అంతేకాకుండా తన భర్తను అన్ ఫాలో కూడా చేసింది. ఈ మధ్యకాలంలో ఇదొక ఫ్యాషన్ గా మారిపోయింది. ఇన్స్టాలో ఫోటోలను డిలీట్ చేయడం, ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే మౌనిక కూడా ఇలా చేయడంతో తాను కూడా విడాకులు తీసుకోబోతుందనే వార్త వైరల్ గా మారింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
- ఎన్టీఆర్ చనిపోవాలని క్షుద్రపూజలు చేశారు – లక్ష్మీపార్వతి
- ‘బిగ్‌బాస్’ హరితేజ విడాకులు.. ఒక్క పోస్ట్‌తో క్లారిటీ …!
- మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు..నటి మహాలక్ష్మి సంచలన వ్యాఖ్యలు