Home » ఆ హీరోయిన్ మాజీ భర్తతో అనుష్క ఇలా చేయబోతోందా.. త్వరలోనే శుభవార్త ఏంటంటే..?

ఆ హీరోయిన్ మాజీ భర్తతో అనుష్క ఇలా చేయబోతోందా.. త్వరలోనే శుభవార్త ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ లలో చాలా సీనియర్ స్టార్ అనుష్క.. ఈమె ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ ఈ మధ్య కాలంలో ఆమె ఇండస్ట్రీకి కొంత దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిశ్శబ్దం సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు తర్వాత ఏ సినిమాలో కూడా కనిపించలేదు. అయితే ఆమెతో సినిమా చేయడానికి అనేక మంది ముందుకు వస్తున్న ఆమె మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదట. అయితే తాజాగా యు.వి వాళ్లు అధికారికంగా ఆమెతో ఒక మూవీ అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. దీనికి అనుష్క కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి అది ఏంటో తెలుసుకుందామా..

Advertisement

అనుష్క సూపర్ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. గత కొంతకాలంగా అనుష్క సినిమాల గురించి ఎలాంటి విషయాలు బయటకు రావడం లేదు. అయితే తాజాగా అనుష్కతో యు.వి.ప్రొడక్షన్స్ సంస్థ వారు ఒక మూవీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నవీన్ పొలిశెట్టి హీరోగా మహేష్ అనేది డైరెక్షన్ లో అనుష్క కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. కాని సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం బయటకు రాలేదు. తాజాగా ఉన్న సమాచారం మేరకు అనుష్కతో మూవీ చేసేందుకు ఒక హీరోయిన్ మాజీ భర్త రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ మాజీ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా మనందరికి తెలిసిన అమలాపాల్. ఈ అమ్మడు ఏఎల్ విజయ్ ని లవ్ చేసి వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. వీరి మధ్య వచ్చిన కొన్ని విభేదాల వల్ల విడిపోయారు.

Advertisement

తర్వాత విజయ్ వేరే యువతిని పెళ్లి చేసుకొని సంసార జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా అందిన సమాచారం మేరకు విజయ్ ఒక లేడీ ఓరియెంటెడ్ కథతో అనుష్కను కలిసినట్టు, ఈ కథ ఆమెకు నచ్చినట్టు ఇందులో నటించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాని అనుష్కతో యు.వి.ప్రొడక్షన్స్ వాళ్ళే చేయబోతున్నారని సమాచారం. ప్రభాస్ సొంత బ్యానర్ అయిన యువీ ప్రొడక్షన్ లోనే మూవీస్ చేసేందుకు అనుష్క ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ బ్యానర్ ని ఆమె సొంత బ్యానర్ గా ఫీలవుతున్నారని ఈ బ్యానర్ పైన అయితేనే సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. కానీ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయం మీద మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. అధికారికంగా ప్రకటన చేస్తే తప్పా ఈ సినిమా వస్తుందా లేదా ఆగిపోయిందా అనే విషయంపై అందరికీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

also read:

 

Visitors Are Also Reading