Home » ఫ్లాప్ సినిమా కోసం ఆశపడి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ లాంటి సినిమాని మిస్ చేసున్న రవి తేజ ! ఏ సినిమా అంటే ?

ఫ్లాప్ సినిమా కోసం ఆశపడి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ లాంటి సినిమాని మిస్ చేసున్న రవి తేజ ! ఏ సినిమా అంటే ?

by AJAY

మ‌హేశ్ బాబు కెరీర్ లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో పోకిరి సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమా మహేశ్ బాబు మాస్ ఇమేజ్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. ఈ సినిమా థియేట‌ర్స్ లో క‌లెక్ష‌న్ ల వ‌ర్షం కురిపించింది. ఇక ఈ సినిమాకు తెర‌వెన‌క చాలా ట్విస్ట్ లు ఉన్నాయి. చాలా మంది న‌టీన‌టులు ఈ సినిమాను మిస్ మిస్ చేసుకున్నా ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం….పూరీ జ‌గ‌న్నాత్ మ‌హేశ్ బాబుకు హోట‌ల్ తాజ్ లో ఉద్ద‌మ్ సింగ్ అంటూ ఓ సిక్కుల కుర్రాడి స్టోరీ చెప్పాడు.

ఆ స్టోరీనే పోకిరి సినిమా క‌థ‌…సినిమాలో హీరోపేరు ఉద్ద‌మ్ సింగ్ కాగా అత‌డు ఓ గ్యాంగ్ లో ప‌నిచేస్తూ వారంద‌రినీ క‌తం చేస్తూ ఉంటాడు. క్లైమాక్స్ లో అత‌డే పోలీస్ అఫీస‌ర్ అని క‌థను పూర్తి చేశాడు. క‌థ మ‌హేశ్ బాబుకు తెగ న‌చ్చేసింది. కానీ అప్ప‌టి కే మ‌హేశ్ బాబు వేరే ప్రాజెక్ట్ లో బిజీ అయిపోయాడు. కానీ ఉత్త‌మ్ సింగ్ సినిమా చేద్దామ‌ని పూరీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.

ఇక పూరి జ‌గ‌న్నాత్ కూడా ఆ గ్యాప్ లో నాగార్జున హీరోగా సూప‌ర్ సినిమాను తెర‌కెక్కించి సూప‌ర్ హిట్ అందుకున్నాడు. ఆ త‌ర‌వాత మ‌హేశ్ బాబును మ‌ళ్లీ క‌లిస్తే సిక్కుల బ్యాక్ డ్రాప్ వ‌ద్ద‌ని చెప్ప‌డంతో పూరీ ఒకే చెప్పి పోకిరి అనే టైటిల్ తో సినిమా క‌థ‌లో కొన్ని మార్పులు చేశాడు. మ‌హేశ్ బాబుకు తెగ న‌చ్చేసింది. ఇంకేముందు ఈ ప్రాజెక్ట్ ను ప‌ట్టాలెక్కించి కేవ‌లం 70 రోజుల్లో సినిమా షూటింగ్ ను పూర్తిచేశారు.

సినిమాలో కామెడీ, యాక్ష‌న్, రొమాన్స్ ఇలా అన్నీ ప్రేక్ష‌కుల‌కు తెగ‌న‌చ్చేయ‌డంతో పోకిరి బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. నిజానికి పూరీ ముందుగా సినిమా క‌థ‌ను ర‌వితేజ‌కు చెప్పాడు. ర‌వితేజ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. కానీ ఆ త‌వ‌రాత ర‌వితేజ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమ‌రీస్ సినిమాలో బిజీగా ఉండ‌టంతో పూరీతో ప్రాజెక్ట్ ప‌క్క‌న ప‌డిపోయింది. దాంతో పూరీ జ‌గ‌న్నాత్ వెయిట్ చేయ‌లేక మ‌హేశ్ తో తెర‌కెక్కించి హిట్ కొట్టాడు. అలా ర‌వితేజ ఫ్లాప్ సినిమా కోసం పోకిరి సినిమాను మిస్ చేసుకున్నాడు.

ALSO READ :  భార్యకి తెలియకుండా భర్త ఇలాంటి పనులు చేస్తే వచ్చే సమస్యలు అవేనా ?

Visitors Are Also Reading