Home » ఐపీఎల్ ఫైనల్ టైమింగ్ ఛేంజ్.. ఎప్పుడంటే…?

ఐపీఎల్ ఫైనల్ టైమింగ్ ఛేంజ్.. ఎప్పుడంటే…?

by Azhar
Ad

గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా ఐపీఎల్ మన ఇండియాలో జరగలేదు. ఐపీఎల్ 2021 ఇక్కడే ప్రారంభమైన.. తర్వాత కరోనా కేసులు రావడం వల్ల వాయిదా పడి మళ్ళీ యూఏఈలో జరిగింది. కానీ ఈ ఏడాది మాత్రం ఐపీఎల్ ను మన ఇండియాలోనే నిర్వహిస్తుంది బీసీసీఐ. మధ్యలో కరోనా సెగ ఒక్కసారి తగ్గిలిన.. ఈ సారి మాత్రం వెన్నకి తగ్గలేదు. కేవలం ముంబైలోనే 25 శాతం ప్రేక్షకుల మధ్య మ్యాచ్ లు నిర్వహిస్తుంది.

Advertisement

ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు అన్ని సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక రెండు మ్యాచ్ లు అయితే మొదటిది 3:30 గంటలకే స్టార్ అవుతుంది. కానీ ఈ నెల 29న జరగనున్న ఫైనల్ మ్యాచ్ టైమింగ్ లో మాత్రం మార్పులు చేసింది. ఈ ఐపీఎల్ 2022 లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న బీసీసీఐ మ్యాచ్ ను ఒక్క 30 నిముషాలు వెన్నకు జరిపి 8 గంటలకు ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది.

Advertisement

ఐపీఎల్ ఫైనల్స్ నాడు సాయంత్రం 6:30కు బీసీసీఐ ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ కార్యక్రమాల్లో బాలీవుడ్ హీరో రన్ వీర్ సింగ్ తో పాటుగా మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నారు. దాదాపు ఒక్క గంటపాటు సాగె ఈ కార్యక్రమాల తర్వాత… రాత్రి 7:30గంటలకు ఫైనల్ కు చేరిన జట్ల కెప్టెన్లను గ్రౌండ్ లోకి పిలిచి… టాస్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మామూలుగానే 30నిమిషాల గ్యాప్ ఇచ్చి… 8గంటలకు ఫైనల్ మ్యాచ్ ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభిస్తారు.

ఇవి కూడా చదవండి :

పంత్.. నువ్వు ఇగో తగ్గించుకోకపోతే కష్టమే..!

టీంఇండియా హెడ్ కోచ్ గా వీవీఎస్…!

Visitors Are Also Reading