Home » IPL 2023 : ఐపీఎల్ కోసం రంగంలోకి రష్మిక, తమన్నా !

IPL 2023 : ఐపీఎల్ కోసం రంగంలోకి రష్మిక, తమన్నా !

by Bunty

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఐపీఎల్ 16వ సీజన్ కి సంబంధించిన షెడ్యూల్ మ్యాచ్ ల వివరాలను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 31న ఐపీఎల్ 2023 ఎడిషన్ కి తెరలేవనుంది. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ వేడుకలను ఆహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు.  అయితే, ఐపీఎల్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్, ఐపిఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ సమాయత్తమవుతుంది.

READ ALSO : AP Govt Jobs 2023 : ఏపీలో 5,388 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీ… పూర్తి వివరాలు ఇవే..!

గతంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిన కారణంగా నాలుగు సంవత్సరాల పాటు ఐపిఎల్ సీజన్ ప్రారంభోత్సవం సాదాసీదాగా సాగింది. 2019, 2020, 2021, 2022 సీజన్లో ఎలాంటి ఓపెనింగ్ సెరీమనీని నిర్వహించలేదు బీసీసీఐ. 2019 సీజన్ నాటికి కరోనా వైరస్ వ్యాప్తి లేనప్పటికీ, ఆ ఏడాది జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన నేపథ్యంలో ప్రారంభ వేడుకలు రద్దయ్యాయి. మిగిలిన మూడు సంవత్సరాలు కూడా కరోనాకాలంలో కలిసిపోయాయి. 2022 ఐపీఎల్ సీజన్ క్లోజింగ్ సెరీమనీలో మాత్రం ఏఆర్ రెహమాన్ పెర్ఫార్మ్ చేశారు.

READ ALSO : రవితేజకు భార్య, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…?

ఈసారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సీజన్ ప్రారంభోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి బీసీసీఐ కసరత్తు మొదలుపెట్టింది. ఈ సీజన్ ఓపెనింగ్ కార్యక్రమంలో టాప్ హీరోయిన్స్ రష్మిక మందన్న, తమన్నా పెర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు వాళ్ళిద్దరితోను సంప్రదింపులు జరిపినట్టు కూడా తెలుస్తోంది. ఇందులో పెర్ఫార్మ్ చేయడానికి వారిద్దరు అంగీకరించినట్లు చెబుతున్నారు.

READ ALSO : పవిత్ర-నరేష్ హనీమూన్… వెలుగులోకి షాకింగ్ నిజాలు…!

Visitors Are Also Reading