Home » IPL 2022 : ఐపీఎల్‌లో అత్య‌ధికంగా డ‌కౌట్ అయింది ఎవ‌రో తెలుసా..?

IPL 2022 : ఐపీఎల్‌లో అత్య‌ధికంగా డ‌కౌట్ అయింది ఎవ‌రో తెలుసా..?

by Anji
Ad

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఆరుగురు ఆట‌గాళ్లు 13సార్లు డ‌కౌట్ అయి తొలిస్థానంలో నిలిచారు. ఇందులో హ‌ర్భ‌జ‌న్‌, పార్థివ్ ప‌టేల్‌, అజింక్యార‌హానే, అంబ‌టిరాయుడు, పీయూశ్ చావ్లా, రోహిత్ శ‌ర్మ ఉన్నారు. వీరిలో చాలా మంది ఆట‌గాళ్లు త‌మ కెరీర్‌లో ఓపెన‌ర్‌గా వ‌చ్చి ఔట్ అయిన వారే. ఐపీఎల్ 2022 నేప‌థ్యంలో వీరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Also Read :  స‌మ్మ‌క్క‌-సార‌క్క జాత‌ర వివాదంపై చిన‌జీయ‌ర్ స్వామి ఏమ‌న్నారంటే..?

రోహిత్ శ‌ర్మ

ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధికంగా ఐదుసార్లు ముంబయి ఇండియ‌న్స్ క‌ప్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌. ఐపీఎల్‌లో 213 మ్యాచ్‌ల‌ను ఆడిన రోహిత్ 5,611 ప‌రుగులు సాధించాడు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 13 సార్లు డ‌కౌట్ అయ్యాడు.

అంబ‌టి రాయుడు

అంబ‌టి రాయుడికి ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉన్న‌ది. 2018లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు టైటిల్ గెల‌వ‌డంలో రాయుడు కీల‌క పాత్ర పోషించాడు. 29.44 స‌గటుతో 3,916 ప‌రుగులు చేసిన రాయుడు 13సార్లు డ‌కౌట్ అయ్యాడు.

అజింక్యా ర‌హానే

Advertisement

గత ఏడాది ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు.,, అజింక్యా ర‌హానే ఐపీఎల్‌లో 151 మ్యాచ్‌ల‌ను ఆడిన ర‌హానే 31.52 స‌గ‌టుతీఓ 3,941 ప‌రుగులు చేశాడు. ఐపీఎల్‌లో నాలుగు జ‌ట్ల‌కు ప్రాతినిథ్యం వ‌హించిన ఇత‌ను.. 13సార్లు డ‌కౌట్ అయ్యాడు.

పార్థివ్ ప‌టేల్

భార‌త మాజీ వికెట్ కీప‌ర్ పార్థివ్ ప‌టేల్ ఐపీఎల్‌లో 22.60 స‌గ‌టుతో 2,848 ప‌రుగులు చేసాడు. ఓపెన‌ర్‌గా వ‌చ్చిన ప‌టేల్ మొత్తం 13 సార్లు ప‌రుగులు చేయ‌కుండా వెనుదిరిగాడు. గ‌తంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ప్రాతినిథ్యం వ‌హించాడు.

గౌతం గంభీర్

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టును రెండుసార్లు క‌ప్ గెలిపించాడు కెప్టెన్ గౌతం గంభీర్‌. ఐపీఎల్‌లో 4,217 ప‌రుగులు చేసిన గంభీర్ 2014లో మూడు సార్లు డ‌కౌట్ అయ్యాడు. త‌న కెరీర్‌లో 12 సార్లు ప‌రుగులు చేయ‌కుండానే వెనుదిరిగాడు.

Also Read :  IPL 2022 : కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కొత్త జెర్సీని మీరు చూశారా..?

వీరితో పాటు పీయూశ్ చావ్లా, మ‌నుదీప్ సింగ్, మ‌నీశ్ పాండే, దినేశ్ కార్తీక్ 12 సార్లు డ‌కౌట్ అయ్యారు. 15వ ఐపీఎల్ సీజ‌న్ మార్చి 26న ప్రారంభం కానుంది.

Visitors Are Also Reading