ఐపీఎల్ అభిమానులకు ఇక మార్చి 26 నుంచి పండుగ అనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సీజన్లో 10 జట్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈసారి ముంబై, పూణే స్టేడియంలలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రేక్షకుల ప్రవేశానికి కూడా ఆమోదం లభించింది. ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు టోర్నికీ సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఎప్పటిలాగే ధోని లుక్ అదిరిపోయింది. ఈసారి ధోనీ బస్సు డ్రైవర్‌గా మారి సౌత్ ఇండియన్ లుక్‌లో కనిపించాడు. ఐపీఎల్ ప్రోమో చాలా బాగుందనే చెప్పవచ్చు.
Also Read : విరాట్ కోహ్లీ సెంచరీ టెస్ట్‌లో స్పెషల్ ఏమిటో తెలుసా..?
Advertisement
ఐపీఎల్ 2022 ప్రోమోలో ధోని బస్సు నడుపుతూ కనిపించాడు. రోడ్డు మధ్యలో అకస్మాత్తుగా బ్రేకులు వేసి రివర్స్ గేర్ వేసి బస్సు వెనక్కి వెళ్లే విధంగా చేశాడు. ట్రాఫిక్ మొత్తం ఆగిపోయి బస్సుతో పాటు వెనక్కి వెళ్తుంది. ఆ సమయంలో ధోని బస్సును నడిరోడ్డులో ఆపి డ్రైవింగ్ సీటులోంచి దిగి బస్సు మెట్లపై కూర్చుంటాడు. వాస్తవానికి ఐపీఎల్ సూపర్ ఓవర్ చూసేందుకు ధోని ఇదంతా చేస్తాడు. మార్గ మధ్యలో బస్సు ఆగిపోవడం చూసిన ట్రాఫిక్ పోలీస్ ధోనిని కారణం అడుగుతాడు. అందుకు ధోని సూపర్ ఓవర్ జరుగుతోంది. ఇది టాటా ఐపీఎల్, మామూలుగా ఉండదంటూ చెప్పుకొస్తాడు.
Advertisement
సమాధానం విన్న ట్రాఫిక్ పోలీస్ ఒకే తలైవా అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక చివరిలో 10 జట్లకు సంబంధించిన కీలక ప్లేయర్లను చూపించారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోని స్థానంలో ఆల్‌రౌండర్ జడేజా ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
When it's the #TATAIPL, fans can go to any extent to catch the action – kyunki #YehAbNormalHai!
What are you expecting from the new season?@StarSportsIndia | @disneyplus pic.twitter.com/WPMZrbQ9sd
— IndianPremierLeague (@IPL) March 4, 2022