Telugu News » Blog » విరాట్ కోహ్లీ సెంచ‌రీ టెస్ట్‌లో స్పెష‌ల్ ఏమిటో తెలుసా..?

విరాట్ కోహ్లీ సెంచ‌రీ టెస్ట్‌లో స్పెష‌ల్ ఏమిటో తెలుసా..?

by Anji
Ads

భార‌త్‌-శ్రీ‌లంక జ‌ట్ల మ‌ధ్య ఇవాళ మొహ‌లీ వేదిక‌గా తొలి టెస్ట్ మ్యాచ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి 100వ టెస్ట్ మ్యాచ్ కావ‌డం విశేషం. తొలుత టీమిండియా కోచ్ రాహుల్ ద్ర‌విడ్ కోహ్లీని స‌న్మానించి.. స్పెష‌ల్ క్యాప్ అందించాడు. ఈ స‌మ‌యంలో కోహ్లీ భార్య అనుష్క శ‌ర్మ కూడా ప‌క్క‌నే ఉన్నారు. క్యాప్ తీసుకున్న త‌రువాత కోహ్లీ అనుష్క‌ను కౌగిలించుకుని Muద్దు పెట్టుకున్నాడు.

Ads

విరాట్ కోహ్లీ క్యాప్ అందుకున్న త‌రువాత కోచ్‌తో పాటు ఆట‌గాళ్లంద‌రికీ కోహ్లీ ధ‌న్య‌వాదాలు తెలిపాడు. ఆ త‌రువాత భార్య అనుష్క‌ను కౌగిలించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ను తాజాగా బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ వీడియో పై అభిమానులు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. విరాట్ ద‌గ్గ‌ర అనుష్క‌ను చూసి చాలా మంది యూజ‌ర్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మ‌రొక వైపు కోహ్లీ అభిమానులు అత‌నిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Ads

విరాట్ త‌న టెస్ట్ కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 7 డ‌బుల్ సెంచ‌రీలు సాధించాడు. దీంతో పాటు 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచ‌రీలు కూడా సాధించాడు. ఇవాళ విరాట్ కాస్త నిరాశ అభిమానుల‌ను కాస్త నిరాశ ప‌రిచాడు. విరాట్ పై అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న త‌రుణంలో కేవ‌లం 45 ప‌రుగులు మాత్రమే చేయ‌డం విశేషం. సెంచ‌రీ చేస్తాడనుకున్న విరాట్ కోహ్లీ 45 ప‌రుగుల వ‌ద్ద స్పిన్న‌ర్ ఎంబుల్డేనియా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. కోహ్లీ ఔట‌వ్వ‌గానే స్టేడియం అంతా ఒక్క‌సారిగా నిశ్శ‌బ్దంగా మారిపోయింది. అభిమానుల‌తో పాటు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా నిరాశ‌కు గుర‌య్యాడు. కోహ్లీ ఔట్ కావ‌డంతో డ్రెస్సింగ్ రూంలో ఒక్క‌సారిగా నిల‌బ‌డి, త‌ల‌పై చేతులు పెట్టుకున్నాడు.

Ad

Also Read :  విరాట్ కోహ్లీని స‌న్మానించిన ద్ర‌విడ్‌..18 ఏళ్ల నాటి ఫొటో వైర‌ల్‌..!