వేసవి కాలం వచ్చిందంటే ఐపీఎల్ మ్యాచ్‌లు ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులందరూ కలిసి ఆడే క్రికెట్ కావడంతో ఐపీఎల్‌కు క్రేజీ మామూలుగా ఉండదు. అయితే నిన్న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిలింగ్ సమావేశంలో లీగ్ షెడ్యూల్ పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసినదే.
Also Read : ఫోన్ వాడే టైం లో ఇవి అసలు మర్చిపోవద్దు…!
Advertisement
మార్చి 26 నుంచి ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానున్నదని బీసీసీఐ నిన్న ప్రకటించినది. మే 29వ తేదీన అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బీసీసీఐ మరొక కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్ జట్లను ఎప్పుడూ లేని విధంగా రెండు గ్రూపులుగా విభజించింది బీసీసీఐ. దీంతో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లు రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచాయి. రెండు కొత్త జట్లు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ వేర్వేరు గ్రూపుల్లో చోటు దక్కించుకున్నాయి. ఏ గ్రూపూలో ఏ జట్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
గ్రూపు – ఏ
ముంబై ఇండియన్స్
కోల్‌కతా నైట్ రైడర్స్
రాజస్థాన్ రాయల్స్
ఢిల్లీ క్యాపిటల్స్
లక్నో సూపర్ జెయింట్స్
గ్రూపు – బీ
చెన్నై సూపర్ కింగ్స్
సన్ రైజర్స్ హైదరాబాద్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
పంజాబ్ కింగ్స్
గుజరాత్ టైటాన్స్
Also Read : IND vs SL : తగ్గేదే లే అంటున్న రవీంద్ర జడేజా