Home » IND vs SL : తగ్గేదే లే అంటున్న రవీంద్ర జడేజా

IND vs SL : తగ్గేదే లే అంటున్న రవీంద్ర జడేజా

by Anji
Ad

సెల‌బ్రెటీల‌ను పుష్ప ఫీవ‌ర్ వ‌ద‌ల‌డం లేదు. ఎక్క‌డో ఓ చోట పుష్ప డైలాగ్‌ల‌కో పుష్ప పాట‌ల‌కు చిందులేస్తున్నారు. తాజాగా భార‌త క్రికెట‌ర్ లైవ్ మ్యాచ్‌లో వికెట్ తీసిన త‌రువాత పుష్ప సినిమా మాదిరిగా త‌గ్గెదేలే అంటూ సంబురాలు చేసుకున్నాడు. గాయం త‌రువాత జ‌ట్టులోకి తిరిగి వ‌చ్చిన ర‌వీంద్ర జడేజా చాలా ఉత్సాహంగా క‌నిపించాడు. ల‌క్నోలో భార‌త శ్రీ‌లంక మ‌ధ్య జ‌రిగిన టీ-20 మ్యాచ్‌లో జ‌డేజా పుష్ప సీన్ చూపించాడు.

Also Read :  ప్ర‌పంచ నెంబ‌ర్ వ‌న్ ఆట‌గాడిగా మెద్వెదెవ్

Advertisement

పుష్ప సినిమాలో హీరో అల్లుఅర్జున్ లా త‌గ్గేదేలే అంటూ గ‌డ్డం కిందికెళ్లి చేయిని పైకి లేపాడు. ఇదంతా లైవ్ మ్యాచ్ లో జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ర‌వీంద్ర జ‌డేజా వికెట్ ప‌డ‌గొట్టిన త‌రువాత త‌గ్గేదేలే పుష్ప మాదిరిగా చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో భార‌త్ 62 ప‌రుగుల తేడాతో శ్రీ‌లంక‌ను ఓడించింది. ర‌వీంద్ర జ‌డేజా 4 ఓవ‌ర్ల‌లో 28 ప‌రుగులు ఇచ్చి 1 వికెట్ తీసాడు. జ‌డేజా ఈ మ్యాచ్‌లో శ్రీ‌లంక బ్యాట్స్‌మెట్ దినేష్ చండిమాల్ వికెట్ తీశాడు.

Advertisement

శ్రీ‌లంక‌తో టీ-20 సిరీస్ లో భార‌త్ బోణి కొట్టింది. ల‌క్నో వేదిక‌గా గురువారం జ‌రిగిన మ్యాచ్‌లో 62 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఇషాన్ కిష‌న్ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. అదేవిధంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ హాప్ సెంచ‌రీతో ఆక‌ట్టుకునే ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం ద‌క్కింది. తొలి వికెట్‌కు రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్ 111 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు.

 Also Read :  శ్రీ‌లంక‌పై భార‌త్ విజ‌యం.. రోహిత్ స‌రికొత్త రికార్డు..!

 

Visitors Are Also Reading