Home » జ‌క్క‌న్న కాళ్లు మొక్కిన అలియాభట్..సంస్కారానికి వంద మార్కులు వేస్తున్న నెటిజ‌న్లు..!

జ‌క్క‌న్న కాళ్లు మొక్కిన అలియాభట్..సంస్కారానికి వంద మార్కులు వేస్తున్న నెటిజ‌న్లు..!

by AJAY
Ad

ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ ను నిన్న విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ ప్ర‌స్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. జ‌క్క‌న్న విజువ‌ల్ వండ‌ర్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ ను ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్, రాజ‌మౌళి, నిర్మాత దాన‌య్య‌, అలియా భ‌ట్, అజ‌య్ దేవ్ గ‌న్ లు పాల్గొన్నారు. అయితే ఈవెంట్ లో జరిగిన ఓ ఘ‌ట‌న అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. ఈవెంట్ లో అలియా భ‌ట్ రాజ‌మౌళి ప‌క్క ప‌క్క‌న కూర్చున్నారు. అలియా భ‌ట్ కాలిపై కాలు వేసుకునే స‌మ‌యంలో ప‌క్క‌న ఉన్న జ‌క్క‌న్న‌కు కాలు త‌గిలింది. దాంతో వెంట‌నే అలియా భ‌ట్ అలా చూస్తూ ఉండ‌కుండా రాజ‌మౌళి కాలికి దండం పెట్టుకుంది.

Advertisement

intresting scene at rrr trailer launch event

intresting scene at rrr trailer launch event

కానీ జ‌క్క‌న్న కూడా త‌న సంస్కారంతో వెంట‌నే వ‌ద్దు అంటూ చేతిని అడ్డుపెట్టాడు. ఇక సాధార‌ణంగా బాలీవుడ్ హీరోయిన్ ల‌కు ఎక్కువ‌గా సంస్కారం తెలియ‌దు అనుకుంటారు. కానీ ఈ ఘ‌ట‌న చూసిన త‌ర‌వాత అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అలియాభ‌ట్ అభిమానులు నెటిజెన్లు ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ రాజ‌మౌళి బాలీవుడ్ మీడియాతో క‌లిసిపోయి మాట్లాడారు. మీడియా అడిగే ప్ర‌శ్న‌ల‌కు చ‌క‌చ‌కా ఆన్స‌ర్ లు ఇచ్చారు.

Advertisement

also read: కొత్త‌జీవితంలోకి అడిగుపెట్టిన బాలీవుడ్ జంట‌..ఫ‌స్ట్ వెడ్డింగ్ ఫోటో వైర‌ల్..!

ఇదిలా ఉంటే ఈ కార్య‌క్ర‌మానికి రామ్ చ‌ర‌ణ్ హాజ‌రుకాలేక‌పోయారు. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న చెల్లెలి పెళ్లిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఉపాస‌న సోద‌రి అనూష వివాహం దోమ కొండ‌లో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక రామ్ చ‌ర‌ణ్ అనూష‌కు బావ అవుతాడు కాబ‌ట్టి తాను కూడా కొన్ని బాధ్య‌త‌లు తీసుకుని పెళ్లి ప‌నులు చూసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే రామ్ చ‌ర‌ణ్ ట్రైల‌ర్ లాంఛ్ కార్య‌క్ర‌మానికి రాలేక‌పోయారు. ఇక ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా అలియాభ‌ట్ న‌టించిన సంగ‌తి తెలిసిందే.

Visitors Are Also Reading