టాలీవుడ్ లో కొన్ని ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండి పోతాయి. అలా ట్రెండ్ సెట్ చేసిన సినిమాలలో సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన శివ కూడా ఒకటి. ఈ సినిమా కాలేజీలో జరిగే గొడవల నేపథ్యంలో తెరకెక్కింది. చైన్ ఫైట్ లు ఈ సినిమాతోనే మొదలయ్యాయి. ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన కొన్ని రికార్డులను ఇప్పటికీ బీట్ చేయలేకపోయారు. ఆర్జీవీ కలెక్టర్ గారి అబ్బాయి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.
Advertisement
ఆ తరవాత రావుగారిల్లు సినిమాకు కూడా అసిస్టెంట్ గా పనిచేశాడు.ఈ సినిమా సమయంలోనే నాగార్జునతో వర్మకు పరిచయం ఏర్పడింది. ఆ తరవాత రాత్రి అనే కథను అల్లి నాగార్జునకు వినిపించాడు. కానీ నాగ్ అంతగా ఇంప్రెస్ అవ్వలేదు. ఆ తరవాత తన కాలేజీ రోజుల నుండి ఒక కథను తయారు చేశాడు ఆర్జీవీ. ఆ కథను నాగార్జున కు వినిపించారు. స్టోరీ భాగా నచ్చడంతో వెంటనే నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇదే కథను తనికెళ్లబరణికి కూడా వర్మ వినిపించారు.
Advertisement
ఈ కథ విన్న తనికెళ్లభరణి కూడా ఆశ్చర్యపోయారట. అప్పటికే కొన్ని సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేసిన తనికెళ్లభరణిని శివ సినిమాకు డైలాగులు రాయమన్నారు. దాంతో ఆయన కథను బట్టి కొన్ని కామెడీ డైలాగులను కూడా రాశారు. కానీ వర్మ కథలో ఒక్క కామెడీ సీన్ కూడా ఉండదని చెప్పారట. దాంతో తనికెళ్లభరణి ఈ సినిమా ఆడినట్టే అని మనసులో అనుకున్నారట. అంతే కాకుండా వీడికేమైనా పిచ్చా అని కూడా అనుకున్నారట. కానీ ఆర్జీవి కోరినట్టుగా మాటలు రాసి ఇచ్చారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా అమలను అనుకున్నారు. అంతే కాకుండా విలన్ పాత్ర కోసం రఘువరుణ్ ను తీసుకున్నారు. భవాని అనే పాత్రలో రఘువరుణ్ నటించిన తీరుకు ప్రశంసలు కురిశాయి. ఈ సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. చివరి మూడు రోజులు మాత్రమే మద్రాస్ షూట్ చేసినట్టు సమాచారం. సినిమా రీరికార్డింగ్ కు ముందు చూసిన నిర్మాతలు కూడా సినిమా ఫ్లాప్ అనుకున్నారు. టైటిల్ విషయంలో కూడా పెదవివిరిసారు. అలా తెరకెక్కిన శివ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.
ALSO READ :
ఆ హీరోయిన్ తల్లిగా ప్రేయసిగా, ఫ్రెండ్ గా.. ఆ ఒక్క హీరోతోనే చేసిందట.. ఎవరంటే..!!
రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసి ఇప్పటికీ బాధపడుతున్న అర్చన…ఏ సినిమా అంటే..!