Home » క‌న్యాదానం చేసేట‌ప్పుడు భార్య భర్తకు ఏ వైపు ఉండాలి…? శాస్త్రం ఏం చెబుతోంది….?

క‌న్యాదానం చేసేట‌ప్పుడు భార్య భర్తకు ఏ వైపు ఉండాలి…? శాస్త్రం ఏం చెబుతోంది….?

by AJAY
Ad

హిందూ సాంప్రదాయంలో ఎన్నో ఆచార సంప్రదాయాలతో పాటు నియమాలు కూడా ఉన్నాయి. అయితే చాలామందికి నియమాల గురించి పెద్దగా తెలియదు. ముఖ్యంగా శాస్త్రంలో ఏముంది శాస్త్రం ఏం చెబుతుంది అన్న విషయాలు చాలామందికి తెలియదు. దాంతో ఎవరు ఏం చెప్పినా దానిని పాటిస్తూ ఉంటారు. కాగా కొంతమంది భార్య భర్తకు ఎల్లప్పుడూ ఎడమవైపునే ఉండాలని చెబుతుంటారు.

Advertisement

ఇక మ‌రికొంద‌రు భార్య భ‌ర్త‌కు కుడివైపున ఉండాల‌ని చెబుతుంటారు. అయితే శాస్త్రం మాత్రం సమస్త కార్యాల్లోనూ భార్య ఎడమవైపునే ఉండాలని…లేదా కుడివైపునే ఉండాల‌ని చెప్పడం లేదు. శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం… పూజ చేసేటప్పుడు… దానధర్మాలు చేసేటప్పుడు భార్య భర్తకు ఎడమవైపున ఉండాలని శాస్త్రం చెబుతోంది.

Advertisement

అంతేకాకుండా కన్యాదానం చేసే సమయంలో విగ్రహాలను ప్రతిష్టించేటప్పుడు భర్తకు భార్య కుడివైపున ఉండాలని శాస్త్రం చెబుతోంది. బ్రహ్మదేవుడు మగవాడిని కుడి భాగం నుండి, స్త్రీని ఎడమ భాగం నుండి సృష్టించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీమహావిష్ణువు తన భార్య శ్రీ మహాలక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకున్నాడని శాస్త్రం చెబుతోంది. కాబట్టి సందర్భాన్ని బట్టి భార్య భర్తకు ఏ వైపు నిలబడాలి అనేది నిర్ణయించుకోవాలట‌.

Visitors Are Also Reading