Home » ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా చూసి బొబ్బిలిసింహం క‌థ రాసిన విజయేంద్ర‌ప్ర‌సాద్..? ఆ సినిమా ఏదంటే..?

ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా చూసి బొబ్బిలిసింహం క‌థ రాసిన విజయేంద్ర‌ప్ర‌సాద్..? ఆ సినిమా ఏదంటే..?

by AJAY

సాధారణంగా దర్శకులకు ఎంతో క్రేజ్ వస్తుంది… కానీ సినిమాకు ఎంత గొప్ప కథ అందించినా కూడా రచయితల పేర్లు బయటకు రావు. కానీ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్ కు చెందిన విజయేంద్రప్రసాద్ పేరు మారుమోగుతోంది. రాజేంద్ర‌ప్ర‌సాద్ బాహుబ‌లి,ఆర్ఆర్ఆర్, బ‌జ‌రంగి బాయ్ జాన్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌కు క‌థ‌ల‌ను అందించారు. అయితే సాధారణంగా ఓ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరో సినిమాకు కథను రాసుకోవడం సర్వసాధారణం.

విజయేంద్రప్రసాద్ కూడా అలా ఏఎన్ఆర్ న‌టించిన ఓ సినిమా క‌థ ఇన్స్పిరేష‌న్ గా బాలయ్య సినిమాకు కథను రాసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం…. కోదండరామిరెడ్డి బాలకృష్ణ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్ లోనే బొబ్బిలి సింహం సినిమా వచ్చింది. కోదండరామిరెడ్డి బాలయ్యతో సినిమా చేయాలనుకున్నప్పుడు విజయేంద్ర ప్రసాద్ ను ఓ మంచి కథ రాయమని కోరారట.

దాంతో విజయేంద్రప్రసాద్ అక్కినేని దాసరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ప్రేమాభిషేకం చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఒక క‌థ‌ను రాసారట. ప్రేమాభిషేకం సినిమాలో ఏఎన్ఆర్ శ్రీదేవి పాత్రలను రోజా బాలకృష్ణలుగా అనుకున్నారట. ప్రేమాభిషేకం సినిమాలో ఏఎన్ఆర్ కు క్యాన్సర్ ఉండగా…. బొబ్బిలి సింహం సినిమాలో రోజాకి క్యాన్సర్ ఉంటుంది.

అంతేకాకుండా ప్రేమాభిషేకం సినిమా పూర్తిగా లవ్ ట్రాక్ లోనే ఉంటుంది. అయితే బాలయ్య‌ ఇమేజ్ కు తగ్గట్టుగా బొబ్బిలి సింహం సినిమాలో కాస్త మాస్ మసాలా అంశాలను జోడించి వాణిజ్యపరంగా తీర్చిదిద్దారట. అలా వచ్చిన బొబ్బిలి సింహం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లోనే ఏడు కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ సినిమాకు కీరవాణి అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా అప్పటి స్టార్ హీరోయిన్ లు రోజా మీనా నటించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమా 15 కేంద్రాల్లో వంద రోజులు ఆడి బాలయ్య ఫ్యాన్స్ ను కాలర్ ఎగరేసుకునేలా చేసింది.

Visitors Are Also Reading