Home » ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్..పాక్ లో ఇంటర్నెట్, సోషల్ మీడియా “బ్లాక్”

ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్..పాక్ లో ఇంటర్నెట్, సోషల్ మీడియా “బ్లాక్”

by Bunty
Ad

 

“పాకిస్తాన్ తెహ్రిక్ ఎ ఇన్సాఫ్” ( పి.టి.ఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత పాకిస్థాన్ దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి నిరసనలు. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ, ఫైసలాబాద్, గుజ్రాన్ వాలా, ముల్తాన్, పెషావర్, మర్దాన్ నగరాల్లో కొనసాగుతున్నాయి నిరసనలు. ఇస్తామాబాద్ హైకోర్టు పరిసరాల్లో పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు “పిటిఐ” నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు.

Advertisement

ఈ నిరసనల్లో భాగంగా 25 పోలీసుల వాహనాలు, 14 ప్రభుత్వ భవనాలను దగ్ధం చేశారు నిరసనకారులు.130 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ ను “నేషనల్ ఆకౌంటబులిటీ బ్యూరో” అరెస్ట్ చేయడాన్ని సమర్ధిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యకరంగా ఉందని “పిటిఐ” నేతలు పేర్కొంటున్నారు. ముందస్తు బెయిల్ పై విచారణ జరిపి నిర్ణయం తీసుకోకుండానే, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ “న్యాయబద్దం” అని హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు లో
సవాల్ చేస్తున్నామన్నారు “పిటిఐ” నేతలు.

Advertisement

Imran Khan: Internet, social media blocked as violence rages in Pakistan -  P.M. News

ఇక ఈ నిరసనల నేపథ్యంలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని, సామాజిక మాధ్యమాలను “బ్లాక్” చేసింది పాక్ ప్రభుత్వం. అటు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకునేలా, నెట్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని “పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అధారిటీ” కి విజ్ఞప్తి చేసింది “ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్”. శాంతియుతంగా కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మక రూపు దాల్చేలా కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు “పిటిఐ” నేతలు.

 

Visitors Are Also Reading