Home » రాముడిని ఏకపత్నీవ్రతుడని ఎందుకు అంటారు? ఈ అద్భుతమైన కథ చదివితే ఒళ్ళు గగుర్పొడుస్తుంది!

రాముడిని ఏకపత్నీవ్రతుడని ఎందుకు అంటారు? ఈ అద్భుతమైన కథ చదివితే ఒళ్ళు గగుర్పొడుస్తుంది!

by Srilakshmi Bharathi
Published: Last Updated on

చాలా మందికి భార్య ఒక్కరే ఉన్నా, ఏకపత్నీవ్రతుడు అని శ్రీరాముడిని మాత్రమే అంటారు. అలా ఎందుకు అంటారో ఈ ఆర్టికల్ పూర్తిగా చదివితే తెలుస్తుంది. రావణుడు పరస్త్రీలోలుడు అన్న సంగతి తెలిసిందే. అపరిమిత శక్తులున్న, ఎంత జ్ఞానాన్ని సముపార్జించినా.. రావణుడు మరొకరి భార్యని కోరుకోవడంతో లోకం అతనిపై నిందలేసింది. అయితే.. ఆయన భార్య మండోదరి మాత్రం రావణుడిని గొప్పగానే చూసింది. రామ రావణ యుద్ధం ముగిసాక.. రాముడి చేతిలో రావణుడు మరణించాడని తెలిసి నిస్చేష్టురాలైంది. రాముడిపై విపరీతమైన కోపాన్ని పెంచుకుంది.

 

మానవుడు అయిన రాముడి చేతిలో రావణుడు మరణించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. వెంటనే యుద్ధభూమికి బయలుదేరి వచ్చి రాముడిపై తన కోపాన్ని , ఆక్రోశాన్ని వెళ్ళగక్కాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా మండోదరి తన వస్త్రధారణని చూసుకోకుండా.. కనీసం విడిపోయిన జుట్టుని కొప్పు కూడా కట్టుకోకుండా యుద్ధ భూమికి బయలుదేరి వెళ్ళింది. అయితే..అక్కడ రావణ వధ తరువాత ఇరు పక్షాల సైన్యాలు యుద్ధం ఆపేసి నిలబడి చూస్తున్నాయి.

రాముడు కూడా ఓ పక్కన బండరాయిపై కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో వచ్చిన మండోదరి రాముడి వద్దకు వెళ్లి తన కోపాన్ని వెళ్ళగక్కాలని అనుకుంది. రాముడు కూర్చున్న వైపుగా అడుగులు వేసింది. రాముడు వెనకగా తన వైపుకు వస్తూ కనిపిస్తున్న నీడని చూసాడు. అది ఓ స్త్రీ రూపం అని, తన భార్య సీతది కాదని గుర్తించాడు. వెంటనే ఆ నీడ కూడా తనని తాకకుండా లేచి నుంచున్నాడు. అంత బాధలో కూడా శ్రీ రాముడి చర్యని మండోదరి గుర్తించింది. రాముడిని చూసి ఆశ్చర్యపోయింది. అప్పటి వరకు ఆమెకు ఉన్న కోపం చప్పున చల్లారిపోయింది. పర స్త్రీ నీడని కూడా తాకనివ్వడానికి రాముడు ఇష్టపడని వాడు కాబట్టే ఆయన్ని ఏకపత్నీవ్రతుడు అంటారు. అందుకే ఆయన గురించి యుగాలు గడుస్తున్నా మనం చెప్పుకుంటూనే ఉన్నాం.

Visitors Are Also Reading