తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు దాసరి నారాయణ రావు. ఆయన ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. కొన్ని వందలాది చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు దర్శకుడు దాసరి నారాయణరావు. దాసరి కేవలం సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా.. చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేసారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో ఎవరైనా ఆర్టిస్టులు తమ వద్దకు సాయం కోసం వస్తే.. కచ్చితంగా తనకు తోచినంత చేసేవాడు. అప్పట్లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఒసేయ్ రాములమ్మ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం నమోదు చేసింది.
Advertisement
ముఖ్యంగా దొరల అహంకారం వల్ల అణగదొక్కబడిన బడుగు, బలహీన వర్గాల చైతన్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. అయితే ఈ సినిమాలో విజయశాంతి చిన్నప్పటి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ సినీ ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పేరు అధికారికంగా తెలియకపోయినప్పటికీ ఆమె పాత్ర మాత్రం సినీ అభిమానులకు ఇప్పటికీ గుర్తుంటుంది. జూనియర్ రాములమ్మ సినిమా హీరోయిన్ కావాలని చిన్నప్పుడే తన ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా హైదరాబాద్ కి వచ్చేసిందట. ఈ నేపథ్యంలోనే దర్శకుడు దాసరి నారాయణరావు ఇంటి వద్దకు వచ్చి తనను హీరోయిన్ చేయాలని అడిగిందట. దీంతో దాసరి ఒసేయ్ రాములమ్మ చిత్రంలో అవకాశం కల్పించారు.
Advertisement
ఇక ఈ సినిమా తరువాత తన ఇంట్లో వాళ్లని పిలిచి సర్ది చెప్పి ఇంటికి పంపించినప్పటికీ తరుచూ దాసరి నారాయణరావు దగ్గరికి హీరోయిన్ ని చేయమని వస్తుండేదట. ఇక దాసరి ఆమెకు సర్ధి చెప్పారట. అయినప్పటికీ వినకపోవడంతో ఇక లాభం లేదనుకొని దాసరి తన కారు డ్రైవర్ కి ఇచ్చి పెళ్లి చేశాడట. ఒసేయ్ రాములమ్మ చిత్రంలో నటించిన తరువాత ఈమెకు మళ్లీ ఏ సినిమాలో కూడా నటించే అవకాశం రాలేదు.. నటించలేదు కూడా. ప్రస్తుతం ఈ జూనియర్ రాములమ్మ ఎక్కడ ఉంది.? ఏం చేస్తుంది అనే విషయాలు మాత్రం తెలియడం లేదు. సినీ పరిశ్రమలో ఎలాంటి సమస్య ఉన్నా దర్శకరత్న దాసరి నారాయణరావు ముందుండి ఆ సమస్యలు పరిష్కరించేవారు. దాసరి చనిపోవడంతో సినిమా పరిశ్రమ పెద్దదిక్కునే కోల్పోయింది.
Also Read : క్యూట్ గా కనిపించే హీరో అజిత్ కూతురు.. ఇప్పుడు ఎంత అందంగా ఉందంటే..!!