ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు ఆరవ సీజన్ ను కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోవడానికి సిద్ధం అవుతుంది.గత బిగ్ బాస్ సీజన్ 5 లో సన్నీ కప్ అందుకుని అందరిని ఆశ్చర్య పరచగా షణ్ముఖ్ రన్నర్ గా మిగిలిపోయాడు. క సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా పూర్తి అవ్వడంతో ఇప్పుడు సీజన్ 6 కూడా స్టార్ట్ చేయబోతున్నారు నిర్వాహకులు.మధ్యలో బిగ్ బాస్ ఓటిటి తో రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సీజన్ 6 అంగరంగ వైభవంగా స్టార్ట్ చేయబోతున్నారు.ఈసారి కూడా నాగార్జున నే హోస్ట్ గా వస్తున్నాడు. కంటెస్టెంట్‌గా ఉదయభాను, దీపికా పిల్లి, ఆదిరెడ్డి యూట్యూబర్, చలాకి చంటి , జబర్దస్త్ అప్పారావు, యాంకర్ నేహా చౌదరి వంటి పలువురు బిగ్‌బాస్ సీజన్‌కి ఎంపికయ్యారు. వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఉదయభాను :
Advertisement
ఉదయభాను గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈమె ఇప్పుడు ఉన్న యాంకర్స్ కంటే ముందుగానే ఇండస్ట్రీలో అడుగు పెట్టి టాప్ లో కొనసాగింది.అయితే కొంత కాలంగా ఈమె యాక్టివ్ గా లేదు.ఇప్పుడిప్పుడే ఈమె లైమ్ లైట్ లోకి వస్తుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె ఈసారి సీజన్ లో కనిపించడమే కాకుండా అందరికంటే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న జాబితాలో టాప్ ప్లేస్ లో ఉందట. మరి టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఉదయభాను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.
దీపికా పిల్లి :
దీపికా పిల్లి ఈమె సోషల్ మీడియా ద్వారా చాలా పాపులర్ అయింది. వీడియోలను యూట్యూబ్ లో అప్‌లోడ్ చేసే ఓ ఛానెల్‌ని నడుపుతోంది. అలా ఫేమస్ అయినా దీపిక పిల్లి 2.2 మిలియన్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోకి ఈమె యాంకర్. ఈమె బిగ్‌బాస్ 6 ఎంపికవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంది.
ఆదిరెడ్డి యూట్యూబర్ :
బిగ్‌బాస్ లో ఈసారి టెలివిజన్ యాంకర్స్‌తోపాటు కొంతమంది యూట్యూబర్స్ స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. అందులో ఆదినారాయణరెడ్డి ఒకరు. ఈయన ప్రతీ బిగ్‌బాస్ సీజన్ ను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడూ తన రివ్యూలు అందిస్తుంటాడు. అంతేకాదు.. ఎక్కువగా హౌస్‌లో నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరనే విషయంలో లీక్స్ చేస్తుంటాడు. ఒక విధంగా బిగ్‌బాస్ ఫ్యాన్ ఫాలోవర్స్ ఇతనికి అభిమానులయ్యారు. బిగ్‌బాస్‌పై ఇంత పట్టు ఉన్న ఆదిరెడ్డి ఇక ఆటలోకి దిగితే ఏవిధంగా ఉంటాడనేది ఆసక్తికరంగా మారనుంది.
చలాకి చంటి :
చలాకి చంటి గురించి తెలియని వారు ఉండరు. ఆయన సినిమాల్లో జబర్దస్త్ కామెడీ షో, ఇలా ప్రోగ్రామ్‌లలో చంటి నటిస్తున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌లో ముఖ్యంగా టాస్క్‌లు, గేమ్‌లు, కోపతాపాలు, నవ్వులు, లవ్‌స్టోరీలు, కొట్లాటలు ఇలా అన్ని కలకలిపి ఒకేచోట దొరుకుతాయి. బిగ్‌బాస్ షో కి ఫ్యాన్స్ ఎక్కువనే ఉంటారు. అందులో మన చంటి కూడా వీటన్నింటి కాంబినేషన్ కొత్తదేమి. జబర్దస్త్ కామెడీ షో లో అదరగొట్టే చంటి బిగ్‌బాస్‌లో ఎలా అదరగొడతారో వేచి చూద్దాం.
జబర్దస్త్ అప్పారావు :
బుల్లితెరపై అత్యధిక ఫాలోయింగ్ ఉన్న షోలలో జబర్దస్త్ షో ముందుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అందులో నటించే వాళ్లకు కూడా క్రేజ్ మామూలుగా ఉండదు. పేరుకు కమెడీయన్లు అయినా సంపాదన మాత్రం భారీగానే ఉంటుంది. అప్పారావు జబర్దస్త్‌తో పాటు పలు ఈవెంట్లకు వెళ్తుంటాడు. తాజాగా బిగ్‌బాస్‌లో అప్పారావు ఎలా ఆకట్టుకుంటారో చూడాలి మరి.
రేవంత్ సింగర్ :
రేవంత్ భారతీయ గాయకుడు. ఇతడు శ్రీకాకుళంలో పుట్టాడు. విశాఖలో పుట్టి పెరిగాడు. అతని కుటుంబం సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. సాధరణ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలో తండ్రి మరణించాడు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినప్పటికీ రేవంత్ తల్లి కష్టపడి చదివించింది. డిగ్రీ చివరి సంవత్సరంలో చదువు మానేసి సంగీతంలో తన ప్రతిభను చూపించుకునేందుకు హైదరాబాద్ వచ్చాడు. దాదాపు 200కి పైగా పాటలు పాడాడు. కీరవాణి, కోఠి, మణిశర్మ, చక్రి, థమన్ లాంటి సంగీత దర్శకులు పాటలు పాడించారు. పాటల్లో ప్రతిభ కనబరిచిన రేవంత్ మరి బిగ్‌బాస్‌లో తన ప్రతిభను ఎలా కనరుస్తాడో చూడాలి.
యాంకర్ నేహా చౌదరి :
ఈమె ఒక భారతీయ యాంకర్. స్పోర్ట్స్ ప్రెజెంటర్, నటి, డాన్సర్, మోడల్ మరియు యోగా ట్రైనర్. నేహా ఎక్కువగా తెలుగు టీవీ సీరియల్స్ పరిశ్రమ, ఈటీప్లస్‌లో, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానల్‌లో కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి మోడలింగ్, నటనపై ఆసక్తి కనబరిచింది. ఈమె కూడా బిగ్‌బాస్ 6 సీజన్‌కి కంటెస్టెంట్‌గా ఎంపికైంది.
సూర్య RJ :
Advertisement
కష్టం రుచి చూసిన వారికే విజయం సాధించాలనే కసి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారిలో ఆర్.జే.సూర్య ఒకరని చెప్పవచ్చు. 93.5 రెడ్ ఎఫ్ఎంలో డైరెక్టర్ ఏవీరావు ప్రోగ్రామ్ విన్న వారెవ్వరికైనా ముఖంపై చిరునవ్వు రాకుండా ఉండదేమో. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాలేని రోజుల్లో సూర్య తమ్ముడు జాండిస్ బారిన పడి కిడ్ని సమస్య ఏర్పడింది. డబ్బులు లేక ఆ చిన్నారి ప్రాణాలు వదిలాడు. చిన్నతనంలో పుట్టిన గ్రామాన్ని కోల్పోయాడు. తోబుట్టిన తమ్ముడిని కోల్పోయాడు. మిమిక్రి ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని రెడ్ ఎఫ్ఎంలో ఆర్‌జేగా కెరీర్ ప్రారంభించాడు. ఇప్పుడు ఆర్.జే. సూర్య ఎందరో యువతకు స్పూర్తిగా నిలిచాడు. సూర్య బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్ గా ఎంపికయ్యాడు.
ప్రత్యూష న్యూస్ యాంకర్ :
ఈమె ప్రధానంగా తెలుగు టెలివిజన్ పరిశ్రమలో పని చేస్తుంది. ఏపీలోని విశాఖపట్నంలో మార్చి 15, 1985న జన్మించింది. 2007 ఆమె డిగ్రీ పూర్తి చేసిన తరుఆత టీవీ-9 ఛానెల్ చేరింది. దాదాపు 14 సంవత్సరాల నుంచి ఆమె న్యూస్ రీడర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల ఓ డిబేట్ సందర్భంలో ఆమె లైవ్‌లోనే కన్నీరు పెట్టుకుంది. సోషల్ మీడియాలో ఆమె వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఈమె బిగ్‌బాస్ 6 సీజన్‌లో తన ప్రతిభను చాటుకోనుంది.
గీతూ రాయల్ సోషల్ మీడియా స్టార్ :
బిగ్ బాస్ షో రివ్యూలతో సోషల్ మీడియాలో మంచి పేరునే సంపాదించింది చిత్తూరు పాప గలాటా గీతూ రాయల్. ఈ మధ్య జబర్దస్త్‌లో అడుగుపెట్టి బుల్లితెర ఆడియన్స్‌ని అలరించింది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌తో ఈ బ్యూటీకి పాపులారిటి బాగానే పెరిగింది. బిగ్‌బాస్ షో సీజన్-6కి గీతూ రాయల్ ని సెలెక్ట్ చేసిన వార్తలు వినిపిస్తున్నాయి.
శ్రీ సత్య జబర్దస్త్ :
తెలుగు బుల్లి తెరపై సక్సెస్ ఫుల్ కామెడీ షో జబర్దస్త్ అయితే అక్కడ ఎంత కామెడీ పండిన కూడా ఆడవాళ్ల వేషాల్లో మగవాళ్లుగా కనిపించేవారు. అయితే జబర్దస్త్‌లో లేడీ కమెడీయన్లు కామెడీ పండించగలరని నిరూపిస్తూ.. జబర్దస్త్‌కే ఆడతనాన్ని పరిచయం చేసిన నటి సత్యశ్రీ. అప్పటి వరకు మగవాళ్లే ఆడవాళ్‌ల వేషాల్లో కొంచెం వెగటు పుట్టించేలా నటిస్తున్న సమయంలో సత్య శ్రీ జబర్దస్త్ కే కళ తీసుకొచ్చింది. ఈమె బిగ్ బాస్ 6 సీజన్‌లో తన ప్రతిభను ఎలా కనబరుస్తుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి : ఎన్టీఆర్ తో అమిత్ షా కీలక భేటీ…ఆ విషయాల పై చర్చించనున్నారా..?
మోహన భోగరాజు సింగర్ :
మోహన సొంతూరు ఏపీలోని ఏలూరు. తల్లిదండ్రులు హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. ఆమె బీటెక్ తో పాటు ఎంబీఏ పూర్తి చేశారు. మోహన మూడేళ్ల వయసులో పాటలు పాడడం నేర్చుకుంది. ఆమె రెండవ తరగతిలో ఉండగా త్యాగరాయ గానసభలో జరిగిన పోటీలో పాడి సబ్ జూనియర్ కేటగిరిలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. ఇక అప్పటి నుంచి పాటలు పాడడం ఆసక్తి పెంచింది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన జై శ్రీరామ్ సినిమాలో సయ్యామ మాసం అనే పాట ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. అలా పాటలు పాడుతూ ఆమె జీవితం గడుపుతుంది. బిగ్‌బాస్ 6 సీజన్‌కి ఎంపికైన మోహన అందులో తన ప్రతిభను ఎలా కనబరుస్తుందో చూడాలి.
పండు ఢీ డ్యాన్సర్ :
ఢీ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు డ్యాన్సర్ పండు. డ్యాన్సర్‌గానే కాకుండా డ్యాన్స్ మాస్టర్‌గా కూడా పండు మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రధానంగా నెక్లెస్ గొలుసు సాంగ్‌త పండు పాపులారీ పెరిగిపోయింది. యూట్యూబ్‌లో అయితే ఆ వీడియోకి 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కామెడీతో కూడా పండు అలరిస్తుంటాడు. పండు చేసిన కొన్ని డ్యాన్స్ ఫర్పామెన్స్ అలా గుర్తుండిపోతాయి. బిగ్‌బాస్‌లో ఎలాంటి ఫర్పామెన్స్ చేస్తాడో చూడాలి.
ఇనయ సుల్తానా :
ఇనయ సుల్తానా ప్రముఖ మోడల్. ఈమె ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పని చేస్తుంది. 1995 ఆగస్టు 21న హైదరాబాద్‌లో జన్మించిన ఇనాయ మోడలింగ్ కెరీర్ ని ప్రారంభించింది. ఈమె ముఖ్యంగా 2021లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తన పుట్టిన రోజు సందర్భంగా డ్యాన్స్ చేసింది. ఇక అప్పటి నుంచి పాపులర్ అయింది. ఏమవ్ జగత్ సినిమా లో కూడా నటిస్తోంది. బిగ్‌బాస్ 6 సీజన్‌లో తన ప్రతిభ ఎలా కనబరుస్తుందో చూడాలి.
అర్జున్ కళ్యాణ్ యాక్టర్ :
అర్జున్ కళ్యాణ్ తెలుగు నటుడు, రచయిత. ఏపీకి చెందిన అర్జున్ విశాఖలోని గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. యూఎస్ఏలో మాస్టర్స్ చదివాడు. ఇక ఆ తరువాత బోస్టన్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమిలో నటన, స్క్రీన్ ప్లే రైటింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాడు. 2013లో యూఎస్ఏలో చిత్రీకరించిన చిన్న సినిమాతో అర్జున్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. కొన్ని వెబ్ సిరీస్ లతో పాటు ప్రేమమ్, ప్లేబ్యాక్, వరుడు కావలెను వంటి సినిమాల్లో నటించాడు. బిగ్‌బాస్ 6 కి సెలక్ట్ అయిన అర్జున్ హౌస్‌లో తన ప్రతిభను ఎలా కనబరుస్తాడో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి : బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ని రమ్యకృష్ణ ఏమన్నదో తెలుసా..?