Home » బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే ?

బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే ?

by Bunty

 

నందమూరి బాలకృష్ణ గురించి తెలియని వారు ఉండరు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బాలయ్య సినిమాలకి అభిమానులే. బాలకృష్ణ డైలాగ్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే బాలకృష్ణ రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటారు. హిందూపురం ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల బాగోగులను చూసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు.

బాలకృష్ణ తన కుటుంబంతో కూడా కాస్త సమయాన్ని గడుపుతారు. బాలకృష్ణకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు అన్న సంగతి తెలిసిందే. ఇక పెద్ద కుమార్తె బ్రాహ్మణి వివాహం నారా లోకేష్ తో జరిగిన విషయం తెలిసిందే. ఇక తన రెండవ అమ్మాయి తేజస్విని వివాహం మాజీ ఎంపీ గీతం సంస్థల అధినేత మూర్తి మనవడు శ్రీ భరత్ తో జరిగింది. భరత్ తల్లిదండ్రులు ఇరువురు కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారే.

శ్రీ భరత్ అమెరికాలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇక వివాహ అనంతరం అమెరికాకు వెళ్లి ఎంబీఏ పూర్తిచేశాడు. తనతో పాటు తేజస్విని కూడా అమెరికాకు తీసుకెళ్లి ఎంబీఏ చదివించాడు. ఇక వీరికి ఒక కుమారుడు జన్మించాడు. ప్రతి పండుగకి, ఏ చిన్న ఫంక్షన్ పార్టీ అయినా సరే బాలకృష్ణ ఇంటికి వీరు వెళతారట. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులంతా కలిసి వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తారట.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading