Home » బ్రహ్మానందం పెళ్ళిలో ఇన్ని ట్విస్టులా? ఆయనది కులాంతర వివాహం అని తెలుసా?

బ్రహ్మానందం పెళ్ళిలో ఇన్ని ట్విస్టులా? ఆయనది కులాంతర వివాహం అని తెలుసా?

by Srilakshmi Bharathi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందాన్ని హాస్య బ్రహ్మ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. కొన్ని వందల సినిమాల్లో కమెడియన్ గా నటించిన బ్రహ్మానందం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసాడు. ప్రస్తుతం వయసు, ఆరోగ్యం రీత్యా సినిమాలు తగ్గించినప్పటికీ.. అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే ఉంటున్నారు. ఈ మధ్య సినిమాలు తగ్గించి.. మిగతా సమయాన్ని తన కుటుంబంతో గడపడంలోనూ.. తనకున్న కళలను ప్రయత్నించడంలోనూ గడుపుతున్నారు.

Bramhanandam-Marriage

Bramhanandam-Marriage

 

తనకి ఎంతో ఇష్టమైన ఆర్ట్ ను ఆయన గత కొంతకాలంగా వేస్తున్నారు. ఆయన వేసిన చిత్రాలను తన తోటి స్టార్ లకు బహుమానంగా కూడా ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన వేసిన చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆయన తన ఆత్మకథని కూడా రాసారు. ఆ పుస్తకానికి నేను బ్రహ్మానందం అని పేరు కూడా పెట్టారు. చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు కూడా. ఈ పుస్తకంలో ఆయన తన వ్యక్తిగత జీవితంలోని విషయాలను కూడా రాసారు. బ్రహ్మానందం సినిమాల్లోకి రాకముందు లెక్చరర్ గా పని చేసారు.

Advertisement

Advertisement

లెక్చరర్ గా పని చేస్తున్న టైం లోనే ఆయనకు పెళ్లి చేయాలనీ పేరెంట్స్ భావించారట. అదే సమయంలో బ్రహ్మానందం చదువుకోవడానికి హెల్ప్ చేసిన ఒకావిడ “లక్ష్మి” అనే అమ్మాయి సంబంధం తెచ్చారట. మరోవైపు బ్రహ్మానందం పేరెంట్స్ మాత్రం కట్నం కోసం చూశారట. ఆ టైం లో బ్రహ్మానందం తానూ చదువుకోవడానికి హెల్ప్ చేసిన ఆవిడ తెచ్చిన సంబంధాన్ని చేసుకోవాలనుకున్నారు. కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్నీ చెప్పేసరికి.. అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని ఒప్పుకోలేదట. బ్రహ్మానందం బ్రాహ్మణుల కుటుంబం, లక్ష్మి గరిడి కాపుల కుటుంబం. అయినప్పటికీ.. బ్రహ్మానందం ఆమెను వద్దంటే ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని తల్లితండ్రులతో గొడవ పడ్డారట. దీనితో తల్లి తండ్రులు కూడా ఒప్పుకోక తప్పలేదట. అలా బ్రహ్మానందం లక్ష్మి గారిని వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పెళ్లి చేసుకున్నారట.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading