సాధారణంగా ఇంట్లో, ఆఫీసుల్లో, దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకంటామని తెలిసిందే. అయితే ఇప్పుడు పొలాల్లోనూ కెమెరాటు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇళ్లలో దొంగల భయానికి ఏర్పాటు చేసుకున్నట్లే, పొలాల్లోనూ పెట్టుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా టమాట ధరలు విపరీతంగా పెరిగిన సమయంలో టమాట పంటను కాపాడుకోవడానికి కొందరు రైతులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Advertisement
తాజాగా వెల్లుల్లి రైతులు కూడా ఇదే బాట పట్టారు. అయితే ఇప్పుడు ఈ వంతు వెల్లుల్లి రైతులకు వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లోకి వెల్లుల్లి ధరలు భగ్గుమంటున్నాయి. కిలో వెల్లుల్లి ఏకంగా రూ. 500కి చేరింది. దీంతో తమ పంటను రక్షించుకునే క్రమంలోనే రైతులు కెమెరాలతో గస్తీ కాస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఛింద్వాడా జిల్లా మోహ్ఖేడ్ ప్రాంతంలోని అయిదారు గ్రామాల పొలాల్లో కొన్ని వెల్లుల్లి చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో రైతులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు.
Advertisement
కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత దొంగతనాలు ఆగిపోయాయని రాహుల్ దేశ్ముఖ్ అనే రైతు చెప్పుకొచ్చాడు. ఇక ఈ కెమెరాలు సౌరశక్తితో పనిచేస్తాయని, ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే అలారం మోగుతుందని మరో రైతు తెలిపారు. ఇదిలా ఉంటే గత 60 ఏళ్లలో ఎప్పుడూ వెల్లుల్లి ధరలు ఇంతగా పెరగలేదని రైతులు చెబుతున్నారు. వెల్లుల్లిపాయలు సాగు చేసిన రైతులు ధనవంతులయ్యారు కానీ ఇప్పుడు తాము పండించిన పంట చోరీకి గురవుతుందనే భయంతో ఉన్నామని వాపోతున్నారు.
Also Read : బీజేపీ జాతీయ సదస్సు..మోడీ ఐడీ కార్డ్ వైరల్..!