Home » రోజా మంత్రి కావద్దని ఇంద్రజ దేవుని కోరుకున్నారా…?

రోజా మంత్రి కావద్దని ఇంద్రజ దేవుని కోరుకున్నారా…?

by Azhar
Ad

ఈ మధ్యే ఏర్పడిన ఏపీ సీఎం జగన్ కొత్త క్యాబినెట్ లో రోజాకు మంత్రిగా అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ప్రజలకు ఎక్కువ సేవ చేయాలనే ఉదేశ్యంతోనే తాను ఇక షూటింగ్స్ ను వదిలేస్తున్నాను అని ఆమె తెలిపింది. అయితే రోజా వెళ్లిపోవడంతో జబర్దస్త్ మొత్తం ఆగం అయిపోయిన విషయం తెలిసిందే. 2013లో నాగ బాబు, రోజా జడ్జులుగా ప్రారంభమైన జబర్దస్త్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత షో నిర్వాహకులతో వివాదం రావడంతో నాగబాబు ఇందులోనుండి తప్పుకున్నారు. అప్పుడే కొంచెం డీలా పడిన జబర్దస్త్ ను మళ్ళీ రోజా నిలబెట్టారు.

Advertisement

కానీ ఆవిడ మంత్రి అయ్యి షో నుండి వెళ్లిపోయారు. అయితే రోజా మంత్రి కాకూడదు అని ఇంద్రజ కోరుకున్నట్లు తెలుస్తుంది. రోజా వెళ్లిన తర్వాత ఆ స్థానంలోకి వచ్చారు ఇంద్రజ. అయితే తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో ఇంద్రజ టీం లీడర్లను కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా ఆటో రామ్ ప్రసాద్ ను.. నువ్వు సరిగ్గా స్కిట్స్ రాయలేదు అనే మీ టీంలోని సుధీర్, శ్రీను వెళ్లిపోయారా అని ప్రశ్నించింది. దానికి అతను ఏం సమాధానం చెప్పాడో తెలియదు. కానీ ఆ తర్వాత నేను మిమల్ని ఓ ప్రశ్న అడుగుతాను. రోజాగారు మాతృ కాకూడదని మీరు కోరుకున్నారా అని అడిగాడు.

Advertisement

అయితే ఈ ప్రశ్నలకు సమాధానా తెలియాలంటే మన వచ్చే ఎపిసోడ్ వారలు ఆగాల్సిందే. అయితే ఇప్పుడు రోజా తప్పుకోవడంతో జబర్దస్త్ పూర్తిగా పడిపోయింది. ఇక ఇందులో స్టార్ కమెడియన్స్ అయిన సుధీర్, శ్రీనుతో పాటుగా ఆది కూడా వెళ్లిపోవడంతో రేటింగ్స్ తో పాటు వ్యూస్ కూడా రావడం లేదు. అందుకే ఎలా అయిన మళ్ళీ రేటింగ్స్ పెంచాలని ఇలాంటి ప్రశ్నలు ఆడుతున్నారు అని.. ఇదంతా టీఆర్పీ స్టాంట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి వచ్చే ఎపిసోడ్ లో ఏం ఉంటుంది అనేది.

ఇవి కూడా చదవండి :

రిటైర్మెంట్ కు కారణం చెప్పిన మిథాలీ..!

సోనీకి కాదు మళ్ళీ స్టార్ స్పోర్ట్స్ కే మీడియా హక్కులు…!

Visitors Are Also Reading