ఇండియాలో క్రికెట్ అనేది ఎంత పెద్ద గేమ్ అనేది అందరికి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా మన బీసీసీఐ ఈరోజు ఉంది అంటే అది మన ప్రజల అభిమానమే అనేది అందరికి తెలిసిందే. అయితే ఎప్పుడో ధోని కెప్టెన్సీలో ఇండియా 2007 లో టీ20 ప్రపంచ కప్ లో విజయం సాధించింది అనే విషయం తెలిసిందే.
Advertisement
ఇక ఆ తర్వాత 2013లో ఐసీసీ ట్రోఫీ అందుకున్న భారత్.. మళ్ళీ ఒక్క టైటిల్ కూడా అందుకోలేదు. ప్రతి టోర్నీలో టైటిల్ ఫెవరెట్ గా బరిలోకి దిగడం.. సెమీస్, ఫైనల్స్ లో వెన్నకు రావడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో ఇండియా విజయం సాధించాలి అని క్రికెట్ ఫ్యాన్ అందరూ కోరుకుంటున్నారు. అయితే అలాంటి ఫ్యాన్స్ ను ఖుషి చేసింది ఇండిగో విమాన సంస్థ.
Advertisement
ఇండియా సెమీస్ కు వెళ్లాలంటే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో తప్పక విజయం సాధించాలి. అయితే ఓ అభిమాని ఈ ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నాడు. అందువల్ల అతనికి నెట్ సర్వీస్ లేక మ్యాచ్ లో ఏం జరుగుతుందో తెల్సుకోలేకపోయాడు. అందుకే ఈ విషయం అక్కడ పైలెట్ కు చెప్పగా.. ఆయా పైలెట్ కింద కాంటాక్ట్ చేసి.. స్కోర్ ను తెలుసుకొని ఓ స్లిప్ పైన రాసి ఆ ఫ్యాన్ కు ఇచ్చాడు. ఇక ఈ పైలెట్ ఇచ్చిన స్లిప్ ను ఫ్యాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది.
ఇవి కూడా చదవండి :