ఇండియా మరో చరిత్ర సృష్టించింది. మరోసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది ఇండియా. మిస్ యూనివర్స్ 2021 గా… ఇండియా ఎంపికయింది. ఇజ్రాయిల్ దేశం లో 70వ మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి. అయితే ఈ పోటీల్లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన హర్నాజ్ కౌర్ సింధూ మిస్ యూనివర్స్ టైటిల్ ను సొంతం చేసుకుంది.
Advertisement
India’s Harnaaz Sandhu crowned Miss Universe 2021
Advertisement
సుమారుగా 21 సంవత్సరాల తర్వాత ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటం దక్కడం ఇదే మొదటిసారి. 1994 సంవత్సరంలో సుస్మితాసేన్ ఈ కిరీటాన్ని దక్కించుకోగా.. 2000 సంవత్సరంలో లారా దత్తా ఈ కిరీటాన్ని అందుకున్నారు. ఇక 2021 లో హార్ణాజ్ సందూ మిస్ యూనివర్స్ గా ఎంపికయ్యారు. ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్న హర్ణాజ్.. ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించారు.