ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంటులో….. విశ్వ విజేతగా ఆస్ట్రేలియా అవతరించిన సంగతి తెలిసిందే. ఆదివారం రోజున వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. అహ్మదాబాద్ లోని ఈ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో… ఏకంగా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా జట్టు.
Indians Send Threats To Wife & Daughter Of Travis Head
మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా… 240 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది ఆస్ట్రేలియా జట్టు. మొదట్లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ కుప్పకూలగా… ఆ జట్టును ఓపెనర్ హెడ్ ఆదుకున్నారు.
Advertisement
Advertisement
Indians Send Threats To Wife & Daughter Of Travis Head
అయితే, WC ఫైనల్లో ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ 137 రన్స్ చేసి కీలకపాత్ర పోషించారు. దీంతో అతడి భార్య జెస్సీకాను టార్గెట్ చేస్తూ ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇటీవల తన భార్య, ఏడాది కూతురు ఫోటోను హెడ్ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. నిన్న మ్యాచ్ అనంతరం ఆ పోస్ట్ కింద పలువురు అసభ్యకర కామెంట్స్ చేశారు. దీంతో వారిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు మాక్స్ వెల్ భార్యకు ఇదే పరిస్థితి ఎదురైందట. కానీ ఇది మన సాంస్కృతి కాదని హితవు పలుకుతున్నారు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.