భారత్ – పాకిస్తాన్ క్రికెట్ లో అరుదుగా తలపడతాయి. ఫార్మట్ ఏదైనా అభిమానులను మునివేళ్ల మీద కూర్చోబెట్టి ఆ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించాలని చాలామంది కోరుకుంటారు. ఆసియాకప్ లో భారత్ మొదటి మ్యాచ్ ను పాకిస్తాన్ తో ఆరంభించింది. అయితే ఒక ఇన్నింగ్స్ మాత్రమే జరిగింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కాకుండానే వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. అయినప్పటికీ ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
ఆసియాకప్ తర్వాత ఇరు జట్లు మళ్లీ వన్డే ప్రపంచకప్ లో కలుసుకుంటాయి. వన్డే ప్రపంచకప్ లో భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎంత రసవత్తరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్ లో భారత్ – పాక్ మ్యాచ్ లకు సంబంధించి అఫీషియల్ టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి. కానీ కొందరు బ్లాక్ లో టికెట్లను అమ్ముతున్నారు. సెకండరీ మార్కెట్లో టికెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. సౌత్ ప్రీమియం బెస్ట్ పే టికెట్ రేటు 19.5 లక్షలు కాగా, అప్పర్ టైర్ లోని రెండు టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లుగా స్పోర్ట్స్ టికెట్స్ ఎక్స్చేంజ్ రీసెల్ వెబ్సైట్ వయా గోగోలో చూపిస్తోంది.
Advertisement
Advertisement
అయితే ఒక్కో టికెట్ కు 57 లక్షలు ఉండడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఒక్క భారత్ – పాక్ మ్యాచ్‌లకే కాకుండా టీమ్ ఇండియా ఆటగాళ్లు ఆడే అన్ని మ్యాచ్‌లకు టికెట్ల ధరలను డబుల్ చేసి అమ్ముతున్నారు. భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్ 41వేల నుంచి 3 లక్షల వరకు అమ్ముతున్నారు. అదే భారత్ – ఇంగ్లాండ్ మ్యాచ్ 2.3 లక్షల వరకు టికెట్లను అమ్ముతున్నారు. దీనిపై క్రికెట్ లవర్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఐసిసి, బీసిసిఐలను ట్రోల్ చేస్తున్నారు. సామాన్యులకు అందకుండా ఉన్న ఈ ధరలపై సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తోంది. మరి దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
Arjun Das : తన వాయిస్ వల్లే అవమానాలు ఎదుర్కొన్నాడు…ఇప్పుడు స్టార్ అయ్యాడు !
రోజా దగ్గర 20కి పైగా ఖరీదైన కార్లు… ఆమె ఆస్తి ఎంతో తెలుసా ?
OG Movie : పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో మహేష్ బాబు గెస్ట్ రోల్?