Home » IND vs Pak : వన్డే వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ తేదీ మార్పు? – కారణమిదేనా!

IND vs Pak : వన్డే వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ తేదీ మార్పు? – కారణమిదేనా!

by Bunty
Ad

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ ఈ ఏడాది ఇండియాలో జరగనున్న సంగతి తెలిసిందే. 2011 సంవత్సరంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది. అంటే దాదాపు పది సంవత్సరాల తర్వాత మళ్లీ.. మన ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ షెడ్యూల్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది.

Advertisement

అక్టోబర్ ఐదో తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు దాదాపు 40 రోజులపాటు ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లు దేశంలోని అన్ని స్టేడియంలో జరగనున్నాయి. ముఖ్యంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రధాని నరేంద్ర మోడీ సంతరాష్ట్రం అయిన గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం… అక్టోబర్ 15వ తేదీన జరగనుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ డేట్ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement

అక్టోబర్ 15వ తేదీన ఈ మ్యాచ్ జరగనుండగా… అదే రోజున దేశవ్యాప్తంగా దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లో సెక్యూరిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని… అందుకే ఈ మ్యాచ్ను ఒకరోజు ముందుగా అంటే అక్టోబర్ 14వ తేదీన నిర్వహించేందుకు బీసీసీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని నేషనల్ మీడియా ఓ కథనం ద్వారా తెలిపింది. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం అందుతోంది.

Visitors Are Also Reading