Home » వెస్టిండీస్ టూర్ కు టీమిండియా టెస్టు, వన్డే జట్ల ఎంపిక.. రహానేకు కీలక బాధ్యతలు

వెస్టిండీస్ టూర్ కు టీమిండియా టెస్టు, వన్డే జట్ల ఎంపిక.. రహానేకు కీలక బాధ్యతలు

by Bunty
Ad

 

ఈనెల ప్రారంభంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఘోర ఓటమిపాలైంది. ఏకంగా 209 పరుగుల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చెందింది. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను… కెప్టెన్సీ నుంచి తీసివేయాలని క్రీడా విశ్లేషకులతోపాటు ఫాన్స్ కూడా డిమాండ్ చేశారు.

Advertisement

రహానేకు లేదా శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లకు జట్టు బాధ్యతలు ఇవ్వాలని కొంతమంది ఫ్యాన్స్ తమ డిమాండ్ను వినిపించారు. ఇలాంటి తరుణంలో తాజాగా వెస్టిండీస్ టూర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, తాజాగా వెస్టిండీస్ టూర్ కి టీమ్ ని ప్రకటించింది బీసీసీఐ. ఈ వెస్టిండీస్ టూర్ లో 2 టెస్ట్ లు, 3 వన్డే లు, 5 టీ20 లు ఆడనుంది టీం ఇండియా. జూలై 12 నుంచి విండీస్ టూర్ ప్రారంభం కానుంది. వెస్టిండీస్ టూర్ లో బాగంగా టెస్టు టీమ్ లో స్థానం కోల్పోయాడు పుజారా.

Advertisement

అలాగే యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ లకు చోటు చోటు కల్పించింది బీసీసీఐ. టెస్ట్ మ్యాచ్ వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ కొనసాగనున్నారు. టెస్టుల్లో షమీ కి రెస్ట్ ఇచ్చి.. నవదీప్ సైనీ కి టెస్ట్ టీమ్ లో చోటు కల్పించింది బీసీసీఐ. వన్డే టీమ్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ కొనసాగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. వన్డే టీమ్ లోకి ఉమ్రాన్ మాలిక్, ముకేష్ కుమార్ వచ్చారు. టెస్ట్ మ్యాచ్ లకు వైస్ కెప్టెన్ గా రహానే, వన్డేల్లో వైస్ కెప్టెన్ గా హార్దిక పాండ్య ఫైనల్ చేసింది బీసీసీఐ.

ఇవి కూడా చదవండి

వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !

Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు

అత్త చేతిలో ధోని వ్యాపారం..ఏకంగా రూ.800 కోట్లు !

Visitors Are Also Reading