ప్రపంచ ఆర్థికాభివృద్ధి వచ్చే వార్షిక సంవత్సరం మరింత బలహీనంగా మారే అవకాశముందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ఓ అంచనా వేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) మంగళవారం వరల్డ్ ఎకానమిక్ ఔట్ లుక్ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రపంచ వృద్ధి 2022లో 3.4% ఉండగా.. 2023లో అది 2.9 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. 2024లో మళ్లీ 3.1 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉన్నదని.. పుంజుకునేందుకు కొంచెం సమయం పడుతుంది అని పేర్కొన్నది. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 2022లో 6.8% ఉండగా.. 2023లో 6.1 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం చాలా ముందుందని.. 24 ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి అభివృద్ధి చెందుతుందని అంచనా వేసింది.
Advertisement