టీమిండియా బ్యాట్స్‌మెట్ విరాట్ కోహ్లీ కి మార్చి 04 తేదీన మొహలీ మైదానం ఎంతో ప్రత్యేకంగా మారనున్నది. అదేవిధంగా శ్రీలంక టీమ్‌కు కూడా ఈ మ్యాచ్ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజు విరాట్ కోహ్లీ తన 100వ టెస్ట్ ఆడేందుకు మైదానంలోకి వస్తే.. శ్రీలంక క్రికెట్ జట్టు కూడా మైదానంలోకి దిగిన వెంటనే ఫీట్ సాధిస్తుంది. అయితే ఈ స్పెషల్ మ్యాచ్‌ను అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించలేరన్నది మాత్రం కాస్త నిరాశను కలిగిస్తోంది. వాస్తవానికి మొహలీ టెస్ట్‌కు మైదానంలోకి ప్రేక్షకుల ప్రవేశానికి అనుమతి లేకపోవడమే ఇందుకు కారణం. భారత్-శ్రీలంక మధ్య రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మొమలీ వేదికగా మొదటి మ్యాచ్ జరుగనుంది.
Also Read : శ్రీలంక T20 సిరీస్ విజయం తరువాత రోహిత్ శర్మ ట్రోఫీని ఎవరికి అందించాడంటే..?
Advertisement
Advertisement
బెంగళూరులో రెండవ టెస్ట్ గులాబీ బంతితో జరుగనున్నది. పింక్ బాల్ టెస్ట్‌లో మాత్రం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. విరాట్ కోహ్లీకి 100వ టెస్ట్, శ్రీలంక టీమ్‌కు 300వ టెస్ట్ మొహలీలో పీసీఏ స్టేడియంలో జరిగే తొలి టెస్ట్ విరాట్ కోహ్లీకి చరిత్రాత్మకంగా నిలవనున్నది. అదే సమయంలో శ్రీలంక జట్టుకు సంబంధించిన గొప్ప విజయానికి కూడా సాక్షిగా నిలువనున్నది. నిజానికి మొహలీ టెస్ట్ విరాట్ కోహ్లీ కెరీర్లో 100వ టెస్ట్ అవుతుంది. తద్వారా శ్రీలంకకు ఇది 300వ టెస్ట్ కానున్నది. ఈ విషయాన్ని శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్న ట్వీట్ ద్వారా షేర్ చేశాడు. ఇలాంటి చారిత్రాత్మక మ్యాచ్‌లో తాను భాగం కావడం తన అదృష్టమని పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఆడిన 99 టెస్ట్‌లలో 50.39 సగటుతో 7962 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 27 సెంచరీలు చేశాడు. అతని అత్యధిక స్కోరు 257 పరుగులుగా నిలిచింది. మరొకవైపు శ్రీలంక ఇప్పటివరకు ఆడిన 299 టెస్ట్‌లలో 95 గెలిచి 113 ఓడింది. అదే సమయంలో శ్రీలంక 91 మ్యాచ్‌లు డ్రాగా చేసుకుంది. టీమిండియాతో 44 టెస్ట్‌లు ఆడింది. అందులో 7 మాత్రమే గెలిచింది. అదే సమయంలో 20 మ్యాచ్‌లలో ఓడిపోయింది. భారత్-శ్రీలంక మధ్య 17 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.