Home » BHEEMLANAYAK : ఆ ఒక్క కార‌ణంతో బ్లాక్ బ‌స్ట‌ర్ “భీమ్లానాయ‌క్” కు నో చెప్పిన సాయిప‌ల్ల‌వి…!

BHEEMLANAYAK : ఆ ఒక్క కార‌ణంతో బ్లాక్ బ‌స్ట‌ర్ “భీమ్లానాయ‌క్” కు నో చెప్పిన సాయిప‌ల్ల‌వి…!

by AJAY
Ad

చిన్న వయసులో ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సాయి పల్లవి ఇప్పుడు టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ రానిస్తోంది. మలయాళ సినిమా ప్రేమమ్ తో సాయి పల్లవి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు సాయిపల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో ఫిదా సినిమా తో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి అలరించింది.

also read : భీమ్లానాయ‌క్ డైరెక్ట‌ర్ బ్యాగ్రౌండ్ ఏంటి..? ప‌వ‌ర్ స్టార్ ఎలా అవ‌కాశం ఇచ్చారు…!

Advertisement

 

ఇదిలా ఉంటే సాయిపల్లవి నటించిన సినిమాలు ఎన్ని ఉన్నాయో రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా అన్నే ఉన్నాయని చెప్పవచ్చు. కథకు తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే సాయిపల్లవి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. లేదంటే సినిమాను పక్కనపెట్టేస్తుంది. సాయిప‌ల్లవి రిజెక్ట్ చేసిన‌ సినిమాలు చూసిన‌ట్ట‌యితే…. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా లో ముందుగా సాయి పల్లవి హీరోయిన్ గా అనుకున్నారు.

Advertisement

కానీ సాయి పల్లవి ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా మొదట హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకున్నారు. కానీ ఈ సినిమాను కూడా సాయి పల్లవి రిజెక్ట్ చేసింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా విడుదలైన భీమ్లా నాయక్ సినిమా ఆఫర్ కూడా మొద‌ట సాయిప‌ల్ల‌వి వ‌ద్ద‌కు వ‌చ్చింది.

సినిమాలో రానాకు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే మొదట ఈ పాత్రకు సాయి పల్లవిని అనుకున్నారు. కానీ తన పాత్రకు ప్రాధాన్యత ఉండదు అనే కారణంతో సాయిపల్లవి రిజెక్ట్ చేసినట్టు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు మెగాస్టార్ చేస్తున్న లూసీఫ‌ర్ రీమేక్ కూడా మెగాస్టార్ కు సోద‌రిగా న‌టించే ఆఫ‌ర్ రాగా ఆ సినిమాకు కూడా సాయిప‌ల్ల‌వి నో చెప్పింది.

Visitors Are Also Reading