భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య మొహలీ టెస్ట్ రెండవ రోజు రవీంద్ర జడేజా సత్తా చాటాడు. ముఖ్యంగా మార్చి 05 రెండవ రోజు భారత క్రికెట్ జట్టులో ఆ స్టార్ ఆల్‌రౌండర్ చిరస్మరణీయమైన రికార్డు ఇన్నింగ్స్ ఆడి చరిత్ర సృష్టించాడు. ఎప్పుడు బంతితో ఆకట్టుకునే జడేజా తన కెరీర్లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడుతూ అజేయంగా 175 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉండడంతో అతనికి అవకాశం ఇవ్వలేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో భారత జట్టు 574/8 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
Advertisement
ముఖ్యంగా జడేజా డబుల్ సెంచరీ చేయడానికి ద్రవిడ్, రోహిత్‌లు కారణం అంటూ సోషల్ మీడియాలో వినిపించిన వార్తలపై జడేజా ఓక్లారిటీ ఇచ్చాడు. పిచ్ నుండి వచ్చే సహాయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా జట్టు ఇన్నింగ్స్ డిక్లెర్ చేయాలనేది తన సూచననే అని విమర్శలకు సమాధానం చెప్పాడు జడేజా. తొలిరోజు 45 పరుగులు సాధించిన జడేజా రెండవ రోజు తన ఇన్నింగ్స్‌ను పొడిగిస్తూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తొలుత తన కెరీర్లో రెండవ సెంచరీ సాధించిన అతను రెండవ సెషన్లో పరుగుల వేగాన్ని పెంచాడు. టీ బ్రేకు తరువాత డబుల్ సెంచరీ దిశగా వెళ్తున్న సమయంలో రోహిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో విమర్శలు విపరీతంగా వెల్లువెత్తాయి.
Advertisement
పిచ్‌పై వేరియబుల్ బౌన్స్ ఉందని.. బంతులు తిరగడం ప్రారంభించాయని నేను జట్టుకు చెప్పానని జడేజా మీడియా ముందు వెల్లడించాడు. ముఖ్యంగా శ్రీలంకను బ్యాటింగ్‌కు తీసుకురావాలని నేనే సూచించానని చెప్పాడు. శ్రీలంక అలసట నుంచి ప్రయోజనం పొందాలనే శ్రీలంక ఆటగాళ్లు ఎక్కువ సేపు మైదానంలో ఉండడం వల్ల అలసటను కూడా జట్టు సద్వినియోగం చేసుకోవాలని జడేజా ప్లాన్ చేశాడు. ఇప్పటికే రెండు రోజుల్లో 5 సెషన్ల పాటు ఫీల్డింగ్ చేయడంలో వారు అలిసిపోయారు. దీంతో వెంటనే భారీ షాట్లు ఆడడం.. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడం వారికి అంత సులువు కాదు.
ఇన్నింగ్స్‌ను ముందుగానే డిక్లేర్డ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ అలసటను సద్వినియోగం చేసుకోవాలనేది ప్లాన్ అని పేర్కొన్నాడు. జడేజా ఓ వికెట్ కూడా తీశాడు. జడేజా ప్రణాళిక కూడా మపని చేసింది. చివరి సెషన్లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ జట్టు 4 వికెట్లు పడిపోయాయి. జడేజా స్వయంగా శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నేను అద్భుతమైన స్పిన్‌తో పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్‌పై జడేజా స్పందిస్తూ.. బంతిని స్టంప్‌పై ఉంచాలని ప్లాన్ చేశాం. నా తొలి బంతి టర్న్ అయింది. రెండవ బంతికి నేను నాలుగవ స్టంప్ వద్ద బౌలింగ్ చేస్తానని అనుకున్నాను. మలుపు తిరిగినా లేదా తక్కువకు వెళ్లినా వికెట్ తీయడానికి ఎల్లప్పుడూ అవకాశముందని వెల్లడించాడు.
Also Read : 6th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!