Home » 6th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

6th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గుముకం ప‌ట్టింది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 5,476 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మ‌రో 158 మంది క‌రోనాతో మృతి చెందారు.

ఇప్పటి వరకు 10 వేల మంది రష్యా సైనికులను హతమార్చామ‌ని ఉక్రెయిన్ ప్ర‌క‌టించింది. మ‌రోవైపు రష్యా యుద్దం విష‌యంలో వెన‌క్కితగ్గేదేలే అంటూ ఉక్రెయిన్ కు వార్నింగ్ లు ఇస్తోంది.

Advertisement

హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా లో జెండర్ ఫర్ ఈక్వాలిటీ రన్ ను ప్రారంభించారు. ఈ ఈ కార్య‌క్ర‌మంలో వంద‌లాది మంది యువ‌తీయువ‌కులు పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా నగర సీపీ సీవీఆనంద్, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ లు హాజ‌ర‌య్యారు.

పిల్లి క‌ర‌వ‌డంతో ఏపీలో ఇద్ద‌రు మ‌హిళ‌లు మృతి చెందారు. కృష్ణా జిల్లా వేముల‌వాడ గ్రామానికి చెందిన క‌మ‌ల‌, నాగ‌మ‌ణిల‌ను రెండు రోజుల క్రితం పిల్లి క‌రిచింది. దాంతో పిల్లి క‌రిచిన నాలుగు రోజుల‌కు ఇద్ద‌రు మ‌హిళ‌లు ర్యాబిస్ తో మృతి చెందారు.

Advertisement

ఉక్రెయిన్ న‌ల్ల‌స‌ముద్ర తీరంలోని మికొలైవ్ నౌకాశ్ర‌యంలో 21 మంది భార‌త సైనికులు చిక్కుకుపోయారు. అయితే మికొలైవ్ నౌకాశ్ర‌యాన్ని ర‌ష్యా సైనికులు ముట్ట‌డించే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఆందోళ‌న నెల‌కొంది.

సీఎం జ‌గన్ ను ప్రధాని మోడీ తండ్రిలాగా ఎంతో ఆప్య‌య‌త‌గా చూసుకుంటారని కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ ఎప్పుడు ఢిల్లీ వ‌చ్చినా త‌ప్ప‌కుండా క‌లుస్తార‌ని అన్నారు.

ఈ ఏడాది కూడా ఎంసెట్ లో ఇంట‌ర్ మార్కుల‌కు వెయిటేజీ ఉండ‌ద‌ని విద్యాశాఖ ప్ర‌క‌టించింది. గ‌తంలో ఇంట‌ర్ మార్కుల ఆధారంగా ఎంసెట్ లో 25శాతం వెయిటేజీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ నేడు పూణెలో మెట్రో రైలును ప్రారంభించ‌నున్నారు. తొలిద‌శ‌లో 12కిమీ వ‌ర‌కూ ప్ర‌యాణించ‌నున్న మెట్రోను ప్రారంభించ‌నున్నారు.

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు స‌ర్వం సిద్ద‌మైంది. సోమ‌వారం నుండి బ‌డ్జెట్ స‌మావేశాలు షురూ కాబోతున్నాయి.

cm kcr

cm kcr

తెలంగాణ ప్ర‌భుత్వం బీసీల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. బీసీల‌కు మ‌రో ప‌దేళ్లు రిజ‌ర్వేష‌న్లను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

Visitors Are Also Reading