నరాలు తెగే ఉత్కంఠ. బంతి బంతికి మారే ఆదిపత్యం. విజయం కోసం ఆఖరి వరకు పోరాటం. మైదానంలో యుద్ధం లాంటి వాతావరణం. కేవలం ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పోరులోనే చూస్తాం. పేరుకి జెంటిల్మెన్ గేమ్ అయినా ఇండియా – పాక్ మ్యాచ్ అంటే అదొక యుద్ధం లాగా జరుగుతుంది. నువ్వా నేనా అన్నట్లుగా రెండు జట్లు తలపడుతున్నాయి. మైదానంలో ఆటగాళ్ల కవ్వింపులు, ఉద్వేగపూరిత లక్షణాలు మ్యాచ్ ను ఆసక్తికరంగా మారుస్తాయి. ఇవి చూడడానికి క్రికెట్ ప్రేమికులు అంత టీవీకి అతుక్కుపోతారు. అలాంటి హై వోల్టేజ్ గేమ్ వన్డే ప్రపంచకప్ లో చూడవచ్చు.
ఇరుజట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం రెండు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా నాలుగేళ్ల తర్వాత ద్వైపాక్షిక సిరీస్తో తలపడుతుండడంతో మరింత ఆసక్తిని నెలకొంది. ఇలాంటి తరుణంలో సమయంలో రాహుల్, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అక్టోబర్ 5న ప్రారంభం కానున్న ప్రపంచకప్ లో భారత్ కంటే పాకిస్తాన్ జట్టు పటిష్టంగా ఉందని ఉందన్నారు. అసలు టీమిండియాలో చాహాల్ ను ఎందుకు తీసుకోలేదు అర్థం కాలేదు. సొంత గడ్డపై టీమిండియా ఎక్కువ ప్రెషర్ లోకి వెళ్ళిపోతుంది.
Advertisement
Advertisement
ఎందుకంటే రోహిత్ సేన కంటే బాబర్ అజమ్ టీం మెరుగైన ప్రదర్శన చేస్తోంది. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ను టీవీ వాళ్ళు మహాభారతంలా చిత్రీకరిస్తున్నారు అంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు. అయితే షోయబ్ ఈ తరహా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం ఇది మొదటిసారి కాదు. ఆయన మూడ్ నీ బట్టి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు. ఒక్కోసారి టీమిండియాపై ఎక్కడా లేని ప్రేమ ప్రదర్శిస్తే, మరోసారి ఆటగాళ్లపై లేనిపోని ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు.
ఇవి కూడా చదవండి
నిత్యం దేవునికి పూజలు చేసే వారికే కష్టాలు వస్తాయి… ఎందుకో తెలుసా….?
Rajinikanth : గుడిలో పూజారికి దక్షిణ వేసిన తలైవా రజనీకాంత్
Chandrababu Arrest : చంద్రబాబు కు 10 ఏళ్ల జైలు శిక్ష ..!