Home » హైదరాబాద్, వైజాగ్ లో టీమిండియా మ్యాచులు.. ఎప్పుడంటే ?

హైదరాబాద్, వైజాగ్ లో టీమిండియా మ్యాచులు.. ఎప్పుడంటే ?

by Bunty
Ad

తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త చెప్పింది బిసిసిఐ పాలకమండలి. హైదరాబాద్ మరియు వైజాగ్ లో మ్యాచ్లు నిర్వహించేందుకు ముందుకు వచ్చింది బీసీసీఐ.టీమ్ ఇండియా ఇంటర్నేషనల్ హోమ్ సీజన్ 2023-24 షెడ్యూల్ విడుదల చేసింది బీసీసీఐ. ఇందులో భాగంగానే హైదరాబాద్, వైజాగ్ లోనూ మ్యాచ్ లు జరుగనున్నాయి.

Advertisement

5 టెస్ట్ లు, మూడు వన్డే మ్యాచ్ లు, 8 టీ-20 లు ఆడనున్న టీమ్ ఇండియా.. వరల్డ్ కప్ కి ముందు హోమ్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియా తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. మొహాలీ, ఇండోర్, రాజ్ కోట్ లో వన్డే ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. వరల్డ్ కప్ తర్వాత 5 టీ-20 మ్యాచ్ లు కూడా టీమ్ ఇండియా ఆడనుంది.

Advertisement

ఈ షెడ్యూల్ ప్రకారం…నవంబర్ 23న వైజాగ్ లో తొలి టీ20, డిసెంబర్ 3న హైదరాబాద్ లో లాస్ట్ టీ20 మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది జనవరి లో హోం గ్రౌండ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో 3 టీ-20 లు ఆడనుంది భారత్. మొహాలీ, ఇండోర్, బెంగుళూరు లో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. జనవరి 20 నుంచి ఇంగ్లండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ లు ఆడనున్న భారత్… జనవరి 25 నుంచి 29 వరకు హైదరాబాద్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు వైజాగ్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

Visitors Are Also Reading