Home » ఏయే ప్ర‌దాశాల్లో చెప్పులు వేసుకోకుడ‌దు.. దానికి కార‌ణం తెలుసా?

ఏయే ప్ర‌దాశాల్లో చెప్పులు వేసుకోకుడ‌దు.. దానికి కార‌ణం తెలుసా?

by Bunty
Ad

సాధార‌ణం గా మ‌నం ఎక్క‌డికి వెళ్లిన చెప్పులు ధ‌రించే వెళ్తాం. కానీ కొన్ని ప్ర‌దేశాల్లోకి మాత్రం చెప్పులు ధ‌రించి వెళ్ల‌లేం. ఈ విష‌యాన్ని మ‌నం మ‌న పూర్వీకుల నుంచి చూస్తు నేర్చుకుంటున్నాం. కానీ ఆ ప్రదేశాల్లో ఎందుకు చెప్పులు ధ‌రించమో క్లారిటీ గా తెలియ‌దు. అలాగే మ‌న పూర్వ కాలంలో చాలా మంది చెప్పులు లేకుండా కొంత దూరం అయినా న‌డ‌వాల‌ని మ‌న‌కు చెబుతూ ఉంటారు. నిజానికి వాళ్లు కూడా చెప్పులు లేకుండానే చాలా దూరం న‌డిచే వాళ్లు. ఇదీల ఉండ‌గా.. హిందూ సంప్రదాయం తో పాటు ఇతర మ‌తాల సంప్ర‌దాయ ప‌ద్ద‌తుల ప్ర‌కారం చాలా మంది పుణ్య క్షేత్రాల‌కు చెప్పులు ధ‌రించి వెళ్ల‌రు.

Advertisement

Advertisement

పుణ్య క్షేత్రాల‌తో పాటు మ‌న గృహాల‌లోకి కూడా చెప్పులు ధ‌రించి రారు. గుమ్మం బ‌య‌టే చెప్పుల‌ను విడిచి ఇంట్ల కు వ‌స్తారు. అయితే ఈ మ‌ధ్య కాలం లో చెప్పులను ఇంటి లోప‌లికి కూడా కొంత మంది ధ‌రిస్తున్నారు. అయితే ఇంటి లోపల ఉన్న పూజా గ‌దిలో కి మాత్రం చెప్పులు ధ‌రించి రారు. అలా కొన్ని ప్ర‌దేశాల్లో చెప్పులు ధ‌రించ కూడ‌ద‌ని మ‌న సంప్రదాయం ప్ర‌కారం నియ‌మ నిబంధ‌న‌లు ఉన్నాయి. అలాగే వంట గ‌దిల‌లోకి కూడా చెప్పులు ధ‌రించి రాకుడ‌ద‌ని చెబుతుంటారు. నిజానికి వంట గ‌దిలో అగ్నీ దేవుడు ఉంటార‌ని మ‌నం న‌మ్ముతాము అందుకే మ‌నం అక్క‌డ చెప్పులు ధ‌రించ రాకుడ‌ద‌ని అంటారు.

అలాగే ధ‌నం దాచే ప్రాంతాల‌లోకి కూడా చెప్పులు ధ‌రించ కూడ‌దు అని పండితులు చెబుతూ ఉంటారు. ఇదీల ఉండ‌గా దేవాల‌యాల్లో ప్ర‌తి క‌ణం లో దేవుడు ఉంటారని మ‌నం న‌మ్ముతాము. దేవాలయం లో ఉన్న చిన్న రాయి ని కూడా కొంత మంది దేవుడి గానే భావిస్తారు. అందుకే దేవాలయాల్లోకి చెప్పులు ధ‌రించి రారు. అయితే పూర్వ కాలంలో వారికి ఈ నియ‌మాలు అన్ని తెలుసు కాబ‌ట్టి ఎక్కువ శాతం వారు చెప్పులు ధ‌రించ కుండా న‌డుస్తారు.

Visitors Are Also Reading