సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో కమెడియన్లకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు తమ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇలాంటి కమెడీయనలలో సుత్తివేలు ఒకరు. ఈయన ఈతరం వారికి తెలియకపోయినా ముందుతరం వారికి మాత్రం పరిచయమే. ఇతను ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా.. అదేవిధంగా కీలక పాత్రల్లో నటించారు.
Advertisement
చిత్ర పరిశ్రమ మద్రాస్‌లో ఉన్న సమయంలో ఈయన వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ఎప్పుడు అయితే చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కి వచ్చిందో ఇక ఈయనకు కష్టకాలం మొదలైందనే చెప్పాలి. ప్రధానంగా సినీ ఇండస్ట్రీలో తన గురువుగా భావించే వీరభద్రరావు మరణించడంతో ఎంతో కృంగిపోయారు. సుత్తివేలు అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీనరసింహారావు. ఈయన చిన్నతనంలో చాలా సన్నగా ఉండేవాడు. దీంతో ఈయన పక్కింటి పిన్ని జానకాంబ ఈయనను వేలు అని పిలిచేవారు. ఈయన నటించిన నాలుగు స్థంబాలాట ఈయన పాత్ర పేరు సుత్తి. ఇక ఆ చిత్రం విజయం సాధించిన తరువాత అందరూ సుత్తివేలు అని పిలవడం ప్రారంభించారు.
Advertisement
ఈయన నటించిన నాలుగు స్థంబాలాట ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన జంధ్యాల కూడా మృతి చెందడంతో ఇంకా సుత్తివేలు కృంగిపోయాడనే చెప్పాలి. ఈ విధంగా తన గురువులుగా భావించే వారు మృతి చెందడంతో ఈయనకు ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. కుటుంబ పోషణ కూడా భారమైంది. అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి కుటుంబ పోషణ కోసం ఏకంగా టీవీ సీరియల్స్ లో కూడా నటించారు సుత్తివేలు. ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేందుకు సుత్తివేలు సీరియల్స్ లో నటిస్తూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చివరికీ 2012 సంవత్సరం సెప్టెంబర్ నెలలో తుది శ్వాస విడిచారు.
Also Read :
పాన్ కార్డులో మీ ఫోటో బ్లర్ గా ఉందా.. ఇలా సింపుల్ గా మార్చుకోండి..?
ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని పిచ్చి పని చేశాడన్న రంగనాథ్ కూడా అదే పని చేశాడు.. ఎందుకంటే..?