Home » ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని పిచ్చి పని చేశాడన్న రంగనాథ్ కూడా అదే పని చేశాడు.. ఎందుకంటే..?

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని పిచ్చి పని చేశాడన్న రంగనాథ్ కూడా అదే పని చేశాడు.. ఎందుకంటే..?

by Sravanthi Pandrala Pandrala

మనిషి ఒకేసారి పుడతాడు ఒకేసారి మరణిస్తాడు.. ఈ జీవిత ప్రయాణంలోనే ఎన్నో ఒడిదుడుకులు, సమస్యలు ఆనందాలు, బంధాలు, బంధుత్వాలు, గౌరవాలు అగౌరవాలు వంటివి ఎన్నో ఉంటాయి. ఈ చిన్న జీవితాన్ని కష్టనష్టాలకు ఓర్చుకొని మనం ఏవిధంగా నడుచుకుంటే ఆ విధంగానే మన ప్రయాణం ముందుకు సాగుతుంది. కష్టం వచ్చింది కదా అని వందేళ్ల జీవితాన్ని మధ్యలోనే ముగించుకోవడం అనేది మనం చేసే అసలు తప్పు. మనకు కష్టం వచ్చింది అంటే దానికి పరిష్కార మార్గం కూడా ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. దాని కోసం వెతకాలి తప్ప ఆత్మహత్య చేసుకోవడం పరిష్కార మార్గం కాదని, ఇప్పటికీ ఎంతో మంది నిపుణులు అంటున్నారు. ఆత్మహత్య అనేది లేని వారే చేసుకుంటారనేది తప్పు.

జీవితంలో మంచి స్థాయికి ఎదిగి డబ్బులు అన్నీ ఉన్నా కానీ కొంతమంది వారి జీవితాలను మధ్యలోనే ముగించుకుంటారు. ఇందులో మనం ముఖ్యంగా చూసుకునేది నటుడు రంగనాథ్.. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అంటే సినీ ఇండస్ట్రీలో అంతా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే రంగనాథ్ ఇప్పటికే 300కు పైగా సినిమాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు సాధించాడు. ఆయన నటన లోనే కాకుండా రైల్వే శాఖలో టిక్కెట్ కలెక్టర్ గా పని చేశారు.. అంతే కాకుండా రచయితగా..అంతరంగ మధనం, అక్షర సాక్ష్యం, పద పరిమళం, రంగనాథ్ కథలు, రంగనాథ్ నడత పుస్తకాలు, ఈ చీకటి తొలగాలని రచనలు వంటివి చేసారు ఇవి అక్షర రూపం కూడా దాల్చాయి. ఇవే కాకుండా ఆయన ఎన్నో సీరియల్స్ లో నటించారు. అలాంటి రంగనాథ్ గారు జీవితంలో అకాల మరణం పొందారు.. అదెలా అంటే..

 

అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం తెలుసుకున్న రంగనాథ్ ఆ కుర్రాడు నాతో ఒక గంట సమయం మాట్లాడి ఉంటే ఆ నిర్ణయాన్ని మార్చుకునే వాడని, ఆత్మహత్య ఆలోచన నుంచి తప్పించే వాడినటన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు రంగనాథ్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆయన ముందుగా రైలు కిందపడి చనిపోవాలి అనుకున్నట్టు, కానీ అది కుదరక పోవడంతో మనసు మార్చుకున్నారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యను తప్పుబట్టిన రంగనాథ్ కూడా 2015లో అర్ధంతరంగా ఉరి వేసుకుని చనిపోయారు. దీనికి ప్రధాన కారణం ఆయన ఒంటరితనం అని చెప్పుకోవచ్చు.

ఆయన భార్య చనిపోవడంతో ఒంటరితనం భరించలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన భార్య ప్రమాదవశాత్తు బాల్కనీ నుంచి కింద పడి ఏకంగా 14 సంవత్సరాలు మంచానికే పరిమితం అయింది. ఆమెను కన్నబిడ్డలా కొన్ని రోజుల పాటు సపర్యలు చేశాడు. కానీ ఆ విషయాన్ని ఏనాడు కూడా బయట పెట్టుకునే వారు కాదు. చివరికి ఆమె 2009లో కన్నుమూయడంతో ఆమె లేని లోటు రంగనాథ్ తట్టుకోలేకపోయారు. సరిగ్గా ఆరేళ్ల తర్వాత తను ఎందుకు చనిపోతున్నానో అని గోడ మీద రాసి మరి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఒకరి జీవితం విలువ తెలియజేసిన రంగనాథ్ ఒంటరితనాన్ని భరించలేక కన్నుమూయడంతో ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది.

also read;

Visitors Are Also Reading