Home » భార‌త్‌ను పొగిడిన పాక్ ప్ర‌ధాని.. ఎందుకో తెలుసా..?

భార‌త్‌ను పొగిడిన పాక్ ప్ర‌ధాని.. ఎందుకో తెలుసా..?

by Anji
Ad

దాయాది దేశం పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ భార‌త్ పై తెగ ప్ర‌శంస‌లు కురిపించాడు. ప‌ద‌వీ కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ భార‌త్ పొగ‌డ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ప్ర‌స్తుతం ఆ దేశ పార్ల‌మెంట్ లో ప్ర‌స్తుతం ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కుంటున్నాడు. ఇదిలా ఉండ‌గా.. తాజాగా భార‌త్‌ను పొగుడుతూ ప‌లు వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త విదేశాంగ విధానం భేష్ అని త‌మ పౌరుల కోసం భార‌త్ ఎందాక‌నైనా వెళ్తుంద‌ని పేర్కొన్నాడు.

Also Read :  పెగాస‌స్ అంశాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి కార‌ణం అదే అంటున్న ఆర్ఆర్ఆర్..!

Advertisement

Advertisement

ప్ర‌భుత్వంలో భార‌త్ ఆర్మీ జోక్యం చేసుకోదు అని.. భార‌త ఆర్మీని పొగిడారు. పాక్ ఆర్మీకి డ‌బ్బులిచ్చి ప్ర‌భుత్వాన్ని కాపాడుకోలేన‌ని ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. విప‌క్షాల‌కు లొంగేది లేద‌ని.. రాజీనామాకు కూడా సిద్ధం అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇస్లామిక్ దేశాల స‌ద‌స్సు తరువాత ఇమ్రాన్ రాజీనామా చేయాల‌ని పాక్ ఆర్మీ అల్టిమేటం జారీ చేసింది.

ఈ త‌రుణంలో ఇమ్ర‌న్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వానికి ప్ర‌స్తుతం 25 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకున్నారు. దీంతో ప్ర‌భుత్వం మైనార్టీలో ప‌డింది. దాదాపుగా ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వం ప‌డిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌రం అయిన మేజార్టీ 172 మంది మ‌ద్ద‌తు ఇమ్రాన్ ఖాన్‌కు లేదు.

Also Read :  తెలంగాణ‌లో ఎంసెట్ షెడ్యూల్ ఖ‌రారు.. ఎప్పుడంటే..?

Visitors Are Also Reading