Home » తెలంగాణ‌లో ఎంసెట్ షెడ్యూల్ ఖ‌రారు.. ఎప్పుడంటే..?

తెలంగాణ‌లో ఎంసెట్ షెడ్యూల్ ఖ‌రారు.. ఎప్పుడంటే..?

by Anji
Ad

తెలంగాణ ఇంట‌ర్ విద్యార్థులు ఎప్పుడు ఎప్పుడా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఎంసెట్ ప‌రీక్షల షెడ్యూల్‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ముఖ్యంగా ఎంసెట్‌తో పాటు ఈసెట్ ప‌రీక్ష‌ల తేదీల‌ను తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితాఇంద్రారెడ్డి విడుద‌ల చేసారు. జులై 14న‌, 15, 18, 19, 20 తేదీల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని స‌బితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌టించారు.

Advertisement


జులై 14న ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని.. జులై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. జులై 13న ఈసెట్ ప‌రీక్ష నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. ఇక తెలంగాణలో ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు మే 06వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న విష‌యం తెలిసిందే. జేఈఈ ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో ఈసారి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ఆల‌స్యంగా ప్రారంభం కానున్నాయి.

Advertisement

Also Read :  పార్టీ మారే విష‌యంపై కోమ‌టిరెడ్డి క్లారిటీ..!

Visitors Are Also Reading