అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో చీఫ్ ఎకానమిస్ట్‌గా పని చేసిన ఇండో అమెరికన్ ఆర్థికవేత్త గీతాగోపినాథ్ గతంలోనే అదే సంస్థలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె దిగ్గజాల సరసన చేరారు. గత ఏడాది వరకు చీఫ్ ఎకానమిస్ట్‌గా పని చేశారు. ఈ ఏడాది జెఫ్రీ ఓ మోటో స్థానంలో ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ బాధ్యతలు స్వీకరించిన విషయం విధితమే. ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఐఎంఎఫ్ ఇప్పటి వరకు చీఫ్ ఎకానమిస్ట్‌గా పని చేసిన ఫొటోలను గీతా గోపినాథ్ షేర్ చేసారు. ఇందులో ఆశ్యర్యపోవాల్సిన విషయమేమిటంటే ఆ జాబితాలో ఉన్న వారిలో ఏకైక మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఆ ఫొటోలను ట్వీట్ చేసిన గీతా గోపినాథ్ ట్రెండ్‌ను బ్రేకు చేస్తూ.. ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థిక వేత్తలుగా పని చేసిన వ్యక్తుల సరసన నా ఫొటో ఉన్నదంటూ ట్వీట్‌లో వెల్లడించారు. ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె మూడేండ్ల పాటు ఆ పదవీలో కొనసాగనున్నారు. హార్వర్డ్ వర్సిటిలో ప్రొఫెసర్ గా విధులు చేపట్టాలని అనుకున్నట్టు గీతా గోపినాథ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Advertisement
Advertisement
ఇక గీతా గోపినాథ్ విషయానికొస్తే.. ఆమె భారత్‌లోనే పుట్టి పెరిగింది. ఆమెకు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. కోల్‌కతాలో పుట్టిన ఈమె కర్ణాటకలోని మైసూర్‌లో పెరిగారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి ఎంఏ పూర్తి చేశారు. 2001లో ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో ఎకానమిక్స్ పీహెచ్‌డీ చేశారు. అదే సంవత్సరం యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. 2016లో ఆమె కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఆర్థిక శాస్త్రానికి అసమాన సేవలందించిన గీతా గోపినాథ్ ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు.
Also Read :
nagachaitanya: “హాష్ ” కోసం సమంత-చైతన్య గొడవ.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నాగచైతన్య..!!
ఆ 4 యాప్స్ వెంటనే డిలీట్ చేయండి.. మళ్లీ ఆ మాల్‌వేర్ వచ్చేసింది..!