Home » nagachaitanya: “హాష్ ” కోసం సమంత-చైతన్య గొడవ.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నాగచైతన్య..!!

nagachaitanya: “హాష్ ” కోసం సమంత-చైతన్య గొడవ.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నాగచైతన్య..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

అక్కినేని నాగచైతన్య తాజాగా నటించిన మూవీ థాంక్యూ.. ఈ మూవీ త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నాగచైతన్య, ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. తన అమ్మానాన్నల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అలాగే సమంతపై దగ్గర ఉన్న “హష్” ను గుర్తు చేసుకున్నారు. థాంక్యూ అనేది చాలా గొప్ప పదం.. మనం ఈ పదాన్ని చాలాసార్లు వాడుతూ ఉంటాం. ఈ పదాన్ని కొందరికి మనం ఎక్కువగా చెబుతూ ఉంటాం. కానీ మరికొందరికి చెప్పలేము. కానీ నా జీవితంలో ముగ్గురికి ‘థాంక్స్’ చెప్పాలి అంటూ తల్లి, తండ్రి మరియు సమంతా “హష్” ఫోటోలను షేర్ చేశాడు నాగ చైతన్య.

Advertisement

ఈ పోస్టులను నేను నా జీవితంలో చాలా ముఖ్యమైన వారికి అంకితం చేస్తున్నానని, వారికి థాంక్స్ అనే పదం సరిపోదని, మీరంతా మీ జీవితంలో ముఖ్యమైన వారి గురించి చెబుతూ ఫోటోలను షేర్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు చైతన్య. అమ్మ అంటే నాకు ప్రాణం చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా అల్లారుముద్దుగా పెంచింది. నాన్న ఒక స్నేహితుడి లాగా, నాతో ఉంటూ నాకు ఒక మార్గాన్ని చూపించారు. “హష్ ” ఎలా ప్రేమించాలి, మనిషిలా ఎలా ఉండాలనే విషయాన్ని చెప్పిందంటూ తన జీవితంలో ముఖ్యమైన వాటి గురించి చెబుతూ నాగ చైతన్య ఎమోషనల్ అయ్యాడు. ఈ విషయం చూస్తుంటే సమంత నాగ చైతన్య “హష్” కు ఎంత కనెక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మామూలుగా ఆ కుక్కను సమంత తెచ్చుకుంది. మొదట్లో నాగచైతన్యకు దానిపై ఎక్కువ ప్రేమ లేకపోయినా రాను రాను చాలా ప్రేమ పెరిగిపోయింది. సమంత ఓటిటిలో హోస్టుగా చేసిన ఓ కార్యక్రమానికి నాగచైతన్య గెస్ట్ గా వెళ్ళినప్పుడు “హష్” గురించి ఇద్దరు గొడవ పడ్డారు కూడా.హష్ నా మాట వింటుంది అని సమంత అంటే, కాదు నా మాట వింటుంది అని నాగచైతన్య అన్నారు. మొత్తానికి హష్ మాత్రం నాగచైతన్యకి దూరంగా ఉంటుంది. ఈ తరుణంలో దాన్ని గుర్తు చేసుకొని చైతన్య ఎమోషనల్ అయి పోస్ట్ చేశారు.

also read:

ఎన్టీరామారావు ఇంటితో బాబాయ్ హోటల్ కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా…?

చిరంజీవి వీరాభిమానితో నాగబాబు పెళ్లి.. అసలు ఎలా జరిగిందంటే..?

 

Visitors Are Also Reading